Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mallu Bhatti Vikramarka : మంత్రుల కమిటీ నిర్ణయం,సామా న్యులకు అందుబాటులో హౌసింగ్ బోర్డు ఇళ్ళవిక్రయాలు

Mallu Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: ఓ ఆర్ ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రో డ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మల్లు అధికారు లను ఆదేశించారు. శనివారం డాక్ట ర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం లో ఆదాయ వనరుల సమీకరణ స మావేశంలో మంత్రులు, కమిటీ స భ్యులైన ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పా ల్గొన్నారు.పరిశ్రమల తరలింపునకు సంబంధించి విధి విధానాలు, తర లింపు కేలండర్ ను రూపొందించా లని, తరలింపు ప్రక్రియకు తుది గ డువును ఖరారు చేయాలని సబ్ క మిటీ సభ్యులు అధికారులను ఆదే శించారు.గృహ నిర్మాణ శాఖ ఆధ్వ ర్యంలో ఉ న్న రాజీవ్ స్వగృహ పథ కం కింద వివిధ దశల్లో ఉన్న ఇల్లు, హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ స్థలాల విక్రయాలకు సంబం ధించి సమావేశంలో సమీక్ష నిర్వ హించారు.

హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొన సాగే బహిరంగ వేలం ప్రక్రియ పార దర్శకంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సబ్ క మిటీ సభ్యులు సూచించారు.


సామాన్యులు, మధ్య తరగతి వర్గాలకు ఇల్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారు లు చర్యలు చేపట్టాలని సూచించా రు. గత నెల రోజుల వ్యవధిలో వివి ధ శాఖల ఆదాయాల పెరుగుదల పై ఆయా శాఖలో ఉన్న అధికా రు లు సమావేశంలో నివేదిక సమర్పిం చారు. కమర్షియల్ టాక్స్ శాఖలో 1.8 శాతం, స్టాంప్స్ మరియు రిజి స్ట్రేషన్ శాఖలో 3.6 శాతం, గనుల శాఖలో 7% ఆదాయం పెరుగుదల ఉన్నట్టు అధికారులు మంత్రులకు నివేదించారు.

ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రా మకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్ సుల్తాని యా, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, గనుల శా ఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, మెట్రో పాలిటన్ ఏరియా నగర అభివృద్ధి శాఖ సెక్రటరీ,ఇలంబర్తి, హెచ్ఎండి ఏ కమిషనర్ సర్ఫరాజ్, గనుల శా ఖ కమిషనర్ శశాంక, కలెక్టర్లు హరి చందన, నారాయణరెడ్డి, md tgtd c వల్లూరు క్రాంతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తది తరులు పాల్గొన్నారు.