Ministerkomatireddyvenkatreddy : డబల్ బెడ్ రూoల కేటాయింపుపై ప్రతిపక్షాల రాజకీయం
-- గతంలో అలాట్మెంట్ అయిన వారికే డబల్ బెడ్ రూం ఇండ్లు -- నివాసానికి అన్ని సౌకర్యాలు క ల్పించి లబ్ధిదారులకు కేటాయింపు --ప్రతిపక్షాలు లబ్ధిదారులను రెచ్చ గొడుతున్నాయి --డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు --పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి
డబల్ బెడ్ రూoల కేటాయింపుపై ప్రతిపక్షాల రాజకీయం
— గతంలో అలాట్మెంట్ అయిన వారికే డబల్ బెడ్ రూం ఇండ్లు
— నివాసానికి అన్ని సౌకర్యాలు క ల్పించి లబ్ధిదారులకు కేటాయింపు
–ప్రతిపక్షాలు లబ్ధిదారులను రెచ్చ గొడుతున్నాయి
–డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో చందాలు వసూలు చేస్తున్నారు
–పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని డబల్ బెడ్ రూమ్ లో ఇండ్ల కేటా యింపులో లబ్ధిదారులు ఎలాంటి అపోహాలకు గురి కావద్దని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువా రం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి క్యాంపు కా ర్యాలయంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూములు కట్టించి ఐదు సంవ త్స రాలు కాలయాపన చే సి ఎన్నికల ముందు డ్రా తీసి ఇండ్లు కే టాయిం చిందని అన్నారు. ముం దు చూపు లేకుండా డబల్ బెడ్ రూమ్ ల ఇండ్లను నిర్మించిందని విమర్శించారు.ప్రస్తుతం డబల్ బెడ్ రూంలు నివాసానికి పనికిరాని పేర్కొన్నారు. డబల్ బెడ్రూంలో ఇండ్ల కు డోర్లు లేవని, కిటికీలు పలిగిపో యాయని, విద్యుత్, నీటి సౌక ర్యం, డ్రైనేజీ సౌకర్యం లేదన్నారు. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ట్లుగా బూత్ బంగ్లాల ఉన్నాయని అన్నారు.
ప్రతిపక్షాల మాటలు విని లబ్ధిదారులు ఆ ఇండలోకి వెళ్తే ఇ బ్బందు లకు గురవుతారని వివ రించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు వివి ధ శాఖల అధికారులతో కలిసి ఇండ్లను సందర్శించి చేపట్టాల్సిన సౌ కర్యాలపై మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిం దని తెలిపారు. ఎస్ డిఎఫ్, మున్సిపల్ నిధులు, డీఎం ఎఫ్ నిధుల ను కేటాయించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు అన్ని సౌకర్యాలు కల్పిం చి గతంలో అలా ట్మెంట్ చేసిన లబ్ధిదారులకే కేటాయించడం జరుగు తుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలకు పని లేక లబ్ధిదారులను రెచ్చ గొడుతున్నారని విమ ర్శించారు. డబల్ బెడ్ రూమ్ ల పేరిట కొంద రు చందాలు వసూలు చేస్తున్నారంటూ తమ దృష్టికి వచ్చిందని అ న్నారు. డబల్ బెడ్ రూ మ్ లో ఇండ్ల పేరిట చందా లు వసూలు చేస్తే పోలీస్ , తమ దృష్టికి తీసుకురావాలని సూచించా రు.ఇందిరమ్మ నమూనా ఇంటిపై కూడా బిజెపి నాయకులు వి మ ర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు రెచ్చగొడు తున్నాయని విమర్శించారు.
ఇవి కాకుండా ఏమైనా కొత్తవి ఉంటే చూసుకోవాలని ఎద్దేవ చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లో అన్ని సౌకర్యాలు కల్పించి మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే లబ్ధి దారు లతో సమావేశం ఏర్పాటు చే సి అన్ని సౌకర్యాలు కల్పించిన త ర్వా త వారికి కేటాయించడం జరు గుతుందని తెలిపారు.
నల్గొండ ము న్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమే ష్ గౌడ్ లు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో రాజ కీయాలకు అతీ తంగా అభివృద్ధి పనులు జరుగు తున్నాయని అ న్నారు. పట్టణంలో 550 కి పైగా డబల్ బెడ్ రూములు ఉన్నా యని పేర్కొన్నారు. గతంలో డ్రాలో వచ్చిన వారికే ఇండ్లు కేటా యించ డం జరుగుతుందని స్పష్టం చేశా రు.ప్రస్తుతం అందులో ఎలాంటి సౌక ర్యాలు లేవని, నివాసాయో గ్యంగా లేవని పేర్కొన్నారు.
ఇటీ వలనే ఆ ఇండ్లను పరిశీలించడం జరిగిందని, అన్ని సౌకర్యాలు క ల్పించిన తర్వాత గతంలో కేటా యించిన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కు సంబం ధించి ప్రతిపక్షాలు లబ్ధి దారులను రెచ్చ గొడుతున్నాయని విమర్శించారు. ఇండ్లకు తాళాలు వేస్తే వాటిలో అ భివృద్ధి పనులు ఎలా జరుగుతా యని ప్రశ్నించారు. అన్ని సదుపా యాలు కల్పించిన తర్వాత లబ్ధిదా రులకు అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపాలి టీలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొ న్నారు. నల్గొండ నుంచి ముషంపల్లి రోడ్డుకు రూ.10 0 కోట్లు కేటా యించడం జరిగిందని తెలిపారు.పట్టణంలో 18 వార్డుల లో అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ , సిసి రోడ్డు పనులు జరుగుతున్నాయని పేర్కొ న్నారు. అదేవిధంగా రూ.12 5 కోట్లతో నూతనంగా వాటర్ ట్యాంకు ల నిర్మాణం చేపడుతున్న ట్లు వివరించారు.
వీటితో పాటు ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల కు సంబంధిం చి పనులు జరుగు తున్నాయని వెల్లడించారు. ప్రతిపక్షాలు రాజకీ య లబ్ధి కోసం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదా రులను రెచ్చగొడు తున్నాయని విమర్శిం చారు.ఇప్పటికైనా ప్రతిపక్షాలు అసత్య ఆరో పణలు మానుకొని అభివృద్ధి పనులకు సహకరించాలని సూచిం చారు.
ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కురి రమేష్, డిసి సిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్రి యాదయ్య, బొజ్జ శంకర్, దుబ్బ అశోక్ సుందర్, గురిజ వెంకన్న, చింతపల్లి గోపాల్, పెరిక హరిప్ర సాద్, పెరిక అంజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.