–ఖరీఫ్ 2025కి కేటాయించిన యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే
–కేటాయింపుల ప్రకారం సరఫరా చే యకపోవడంతో 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు
–కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ కు మంత్రి తుమ్మల లేఖ
Minister Tummala : ప్రజా దీవెన, హైదరాబాద్: పార్లమెం ట్ సాక్షిగా యూరియా సరఫరాపై త ప్పుడు లెక్కలు చెప్పడం శోచనీయ మని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ ట న్నులు కేటాయించి, పార్లమెంట్ లో మాత్రం 20.20 లక్షల మెట్రిక్ టన్ను లు అందుబాటులో ఉందని చెప్ప డం వలన రాష్ట్ర రైతులు అయోమ యానికి గురయ్యే అవకాశం ఉంద ని మంత్రి తెలిపారు. ఈ సందర్భం గా రాష్ట్రంలో యూరియా పరిస్థితు లపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి అనుప్రియ ప టేల్ గారికి కేంద్ర రసాయనాలు మ రియు ఎరువుల విభాగం రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల లేఖను జ తపరిచి మంత్రి తుమ్మల లేఖ రా శారు.
ఖరీఫ్ 2025 కోసం రాష్ట్రానికి కేవ లం 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించిందని, కేటా యించిన దానిలో కూడా నెలవారి సరఫరా చేయాల్సిన దానికంటే త క్కువగా సరఫరా చేయడం వలన రాష్ట్రంలో యూరియా కొరత ఏర్ప డిందని లేఖలో పేర్కొన్నారు. ఎప్రిల్ నుండి జులై వరకు కేటాయింపుల ప్రకారం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 4.36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్ర మే సరఫరా చేసిందని, దీంతో రా ష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా త మిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు.
యూరియా కొరతపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రసాయ నాలు, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డాకి లేఖలు కూడా రాయడం జ రిగిందని లేఖలో పేర్కొన్నారు. పా ర్లమెంట్ లాంటి వేదికలలో కూడా తప్పుడు లెక్కలు సమర్పించడం రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీ స్తుందని, జులై మాసం వరకు కేటా యింపుల ప్రకారం సరఫరా కాని 2. 24 లక్షల మెట్రిక్ టన్నుల యూరి యాను కలుపుకొని, ఆగస్టు నెలకు కేటాయించిన యూరియాను త్వర గా సరఫరా అయ్యేలా చర్యలు తీ సుకోవాలని మంత్రి లేఖలో కోరారు.