Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MK Stalin: ప్రతీ జంట 16 మంది పిల్లల్ని కనండి..చంద్రబాబు వ్యాఖ్యలకు స్టాలి న్ మద్దతు

MK Stalin: ప్రజా దీవెన, మద్రాస్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్ (Stalin).. ప్రతీ ఒక్కరు 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశాయని.. అయితే దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయి, లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గుతున్నాయని తీవ్ర ఆందోళ నలు వ్యక్తం అవుతున్న వేళ స్టాలి న్ (Stalin) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు లో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతిని ధ్యం తగ్గిపోతోందని కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో కేటా యింపులో కోత పడొచ్చన్న ఊహా గానాలు వెల్లువెత్తుతున్న వేళ స్టాలి న్ ఈ వ్యాఖ్యలు చేయడం గమ నార్హం.

తిరువాన్మియూర్‌లోని మ రుంధీశ్వరార్ (Rundhiswarar) ఆలయ కళ్యాణ మం డపంలో రాష్ట్ర హిందూ మత, ధర్మా దాయ శాఖ సోమవారం నిర్వహించిన సామూహిక జంటల కల్యాణోత్సవానికి సీఎం ఎంకే స్టాలి న్ (MK Stalin) హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో మాట్లాడిన స్టాలిన్ జనాభా నియంత్రణ గురించి కీలక వ్యాఖ్య లు చేశారు. కొత్తగా పెళ్లయిన జంటలు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వ కాలంలో పెద్దలు ఆశీర్వాదించేవారని ఇప్పుడు ఆస్తి కి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవిం చాలని దీవించండి అంటూ స్టాలిన్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ కారణంగా రాష్ట్రాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపో తోందని పరిస్థితులకు తగ్గట్టుగా మనం మారాలని తెలిపిన స్టాలిన్.. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలని సూచించారు.

అయితే జనాభా నియంత్రణ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయు డు (Nara Chandrababu Naidu)కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేయడం విశేషం. జనా భా సమతుల్యత, వృద్ధాప్య జనా భా పెరుగుతుండటంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబా బు సూచించారు. ఇద్దరు లేదా అం త కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వ్యక్తులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడా నికి అనుమతించే చట్టాన్ని తెచ్చేం దుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు (Plans of Andhra Pradesh Govt) సిద్ధం చేస్తోందని వెల్ల డించారు.