— దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
MLA Balu Naik : ప్రజా దీవెన, దేవరకొండ: ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీ లించి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు అందించడం జరుగుతుందని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ తెలిపారు. శుక్రవారం కొండ మల్లేపల్లి, పి.ఏ. పల్లి మండ ల కేంద్రాలలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా గ్రామ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. దరఖాస్తులు ఇవ్వని వారు ఎవరైనా ఉంటే వారి వద్ద నుండి కూడా దరఖాస్తులు స్వీక రించడం జరుగుతుందని, నిజ మైన అర్హులైన వారికి రేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలి పారు. రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సంవత్స రానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని, ఈ విష యంలో ప్రజలు ఎలాంటి అపో హలకు గురి కావద్దని, మీకోసమే ఈ ప్రభుత్వం ఉందని, దేశంలోనే ఒక సంవత్సర కాలంలో ఏ ప్రభు త్వం చేయని పనిని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందని తెలిపారు.
గత ప్రభు త్వం రైతుబంధు క్రింద రోడ్లు, వెం చర్లు, గుట్టలు, కొండలు వంటి వ్యవసాయ యోగ్యం కాని భూ ములకు 25 వేల కోట్లు వ్యర్థం చేసిందని అన్నారు. సాగుభూమి అయిన ప్రతి ఎకరానికి సంవత్స రానికి 12 వేల రూపాయలు చొప్పు న జనవరి 26 నుండి అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్స రానికి 12 వేల రూపాయలు ఇంది రమ్మ ఆత్మీయ భరోసా కింద అం దించి నిరుపేద రైతు కూలీలకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉం టుందని తెలిపారు. పేదవారికి సరైన వైద్య సౌకర్యాలు అందిం చాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల నుండి 200 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు, అలాగే కొండమల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, ఏదుల నుండి డిండికి ఎత్తిపోతల పథకానికి గాను 1860 కోట్ల నిధుల మంజూరి ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాలకు సంబంధించి 3 లక్షల 50 వేల ఎకరాలు సాగులోకి రావడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని, ఈ ప్రక్రియ ఏ ఒక్క రోజుతో కూడా ఆగిపోదని, ఆఖరి పేదవారి వరకు కూడా ఈ పథకాలను అందించడం ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ..
ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, గ్రామ సభలలో దరఖాస్తులు అందించలేకపోయిన వారు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటి వద్దకే రావాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవారికి సంక్షేమ పథకాలు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, తదితర పథకాల కింద గ్రామ సభలలో చదువుతున్న జాబితా ఖరారు అయినది కాదని, ప్రజా పాలన, కులగణన, గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు గాని మంజూరు చేయలేదని, ప్రజలు ఎవరు అపోహలకు గురికా వద్దన్నారు.అనంతరం పి.ఏ. పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో వాటర్ ప్లాంట్ ను శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ మౌనిక, ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవోలు, తహసిల్దారులు పాల్గొన్నారు.