Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS MLA Dr Sanjay Kumar: జెండా ఎత్తిన మరో ఎమ్మెల్యే బిఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి

–కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల కారు ఎమ్మెల్యే సంజయ్
–కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన సీఎం రేవంత్
–ఉత్తర తెలంగాణ నుంచి మరో నేతతో పాటు మరికొందరు హైదరా బాద్ ఎమ్మెల్యేలూ అదే బాట

BRS MLA Dr Sanjay Kumar:ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీలో జంపింగ్ జిలానీలు రో జు రోజుకూ పెరిగిపోతున్నారు. దీం తో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో పా టు ఆ పార్టీ అధిష్ఠానం ఉక్కిరి బిక్కిరవుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎసలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే ( BRS Leader Jagityal ) కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. గులాబీ పార్టీ ముఖ్యనేత కవితకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాం గ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) ఆదివారం రాత్రి తన నివాసం లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి స మక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పో టీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (jevvan reddy చేతిలో ఓడిపోయిన సంజ య్ కుమార్ ఆ తర్వాత జరి గిన రెండు ఎన్నికల్లోనూ వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్ని కల్లో కూడా నిజామాబాద్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశా రు. కానీ, ఆ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సంజయ్ కుమార్ (Sanjay Kumar) కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న ట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడి యం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పోచారం కాంగ్రెస్ లో చేరిన రెండో రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆ ర్ఏస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పా లి.కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ‘కారు’ దిగి హస్తం గూటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ (Sanjay Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవ డం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు హైదరాబాద్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటివారంలోగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు చర్చ లు సఫలమైనట్టుగా చెబుతున్నా రు. 8-10మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు కాంగ్రెసలో చేరుతున్నట్టు వారి పేర్లతో సహా దానం ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా గంగుల కాంగ్రెస్ లో చేర తారంటూ వార్తల నేపథ్యంలో బీఆ ర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన ను తన ఫామ్ హౌజ్ కు పిలిపించుకు ని మాట్లాడారు. గంగులతోపాటు కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. గంగుల ఫామ్ హౌజ్ వద్దకు వచ్చే సరికే మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు.

సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు…

ఉపాధ్యాయులకు పదోన్నతులతో 15 ఏళ్ల సమస్యను తీర్చారని, ఉపాధ్యాయుల పదోన్నతుల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ మరువలేనిదని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్క రించారని ఉపాధ్యాయ సంఘాల (Teachers Unions) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం వివిధ ఉపాధ్యాయ సం ఘాల నేతలు సీఎం రేవంత్ ను కలి సి కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఈ సందర్భం గా వారు కొన్ని సూచనలు చేశారు. రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ప్రతీ 4,5 మండలాలకు ఒక ఎడ్యుకేషన్ డివిజన్ను ఏర్పాటు చేయాలన్నా రు. డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టును మంజూరు చేసి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలన్నారు.అలాగే మండలంలోని అన్ని ఉన్నత, ప్రాథ మిక పాఠశాలలపై పర్యవేక్షణ అధి కారి స్థాయిలో ఒక మండల స్థాయి అధికారి పోస్టును క్రియేట్ చేయాల ని కోరారు. సీఎంను రేవంత్ (cm revanth reddy) ను కలి సిన వారిలో తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం, జగదీశ్, నర్సింహులు, మహ్మద్ అబ్దుల్లా, రాజభాను చంద్రప్రకాశ్, రాజ గంగారెడ్డి, తుకారాం, మారెడ్డి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠ శాలల్లో పనిచేస్తున్న 1819 మంది పీఈటీలకు ఫిజికల్ డైరెక్టర్లు పీడీలుగా పదోన్నతులు కల్పించి నందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం (పెటా టీఎస్) నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆదివారం సీఎంను మార్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. పోస్టుల అప్గ్రే డేషన్ ద్వారా కొందరు పదోన్నతు లు పొందినప్పటికీ కొన్ని జిల్లాల్లో కొంతమందికి పదోన్నతులు రాలేద ని సీఎంకు వివరించారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడీ విద్యార్హతలుండి ఆయా జిల్లాల్లో అప్గ్రేడేషన్ అయిన పోస్టులు ఉ న్నందున అర్హత కలిగిన వారికి పదో న్నతులు కల్పించాలని నాయకులు కోరారు. కాగా, దీనిపై సానుకూ లంగా స్పందించిన సీఎం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాయాను విద్యా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుపై సమీక్ష..

తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (Integrated residential schools) ఏర్పాటు, వాటి తీరుతెన్నులు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఆది వారం సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారు లు పాల్గొన్నారు. కాగా ప్రతి అసెం బ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పు న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Integrated residential schools)ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావి స్తోంది. ఈ నేపథ్యంలో స్కూల్ భవనం, పరిసరాలు, ఏవి ధంగా ఉండాలో సూచిస్తూ ఆర్కి టెక్చర్ రూపొందించిన పలు నమూ నాలను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. నాణ్యమైన విద్యా బోధనకు వీలుగా తరగతి గదులతో పాటు, విద్యార్థులకు అన్ని వస తులుండేలా ఇంటర్నేషనల్ స్కూ ళ్లకు ధీటుగా అధునాతన భవనా లు నిర్మించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు.రాష్ట్రమంతటా స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటె డ్ రేసిడెన్షియల్ (Integrated residential schools) స్కూళ్ల నిర్మాణం (construction) చేపట్టాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓలీసీ, మైనారిటీ గురు కులాలను ఒకేచోట నిర్మించి మినీ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలని, అప్పుడు గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మరింత సమర్థంగా నిర్వహించే వీలుంటుం దని సర్కారు భావిస్తోంది. వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర సర్కారు పైలట్ ప్రాజెక్ట్ కింద కొదం గల్, మధిర నియోజవర్గాలను ఎంపిక చేసింది.