MLA morning walk : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని ప లు గ్రామాలలో మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మార్నింగ్ వాక్ చేసుకుంటూ పారిశుద్ధ పనులను అభివృద్ధి పను లను పరిశీలించారు. ఉదయం 6 గంటలకు మునుగోడు మండలం లోని పులిపలుపుల గ్రామం చేరు కుని వీధులన్ని కలియ తిరుగుతూ పారిశుద్ధ పనులను పరిశీలించారు.
అనంతరం ఇటీవల బ్రాహ్మణ వెల్లే ముల ప్రాజెక్టు నుండి పులిపలుపు ల చెరువుకు నీరు అందించడానికి తన సొంత ఖర్చులతో కాలువ త వ్వించి నీటిని తరలించిన నేపథ్యం లో పులిపలుపుల పెద్ద చెరువులో ఎంత మేరకు నీరు చేరుకుంది చెరు వు కట్ట పటిష్టంగా ఉందా లేదా అనే విషయాలతో పాటు చెరువు అలు గును గ్రామస్థులతో కలిసి పరిశీల న చేశారు.
పులిపలుపుల నుండి బీరెల్లిగూడం గ్రామం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించి,l రోడ్డుకు చుట్టు పక్కల ఉన్న రైతుల తో మాట్లాడారు. రోడ్డును ప్రమాద కర మూల మలుపులు లేకుండా స్ట్రైట్ గా ఉండేలా చూడాలని రోడ్డు కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.
అదే సమయంలో ఉకోండి గ్రామాని కి చేరుకుని ఇటీ వల రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన కొండ ముర ళి, మర్రి మత్స్యగిరి యువకుల కు టుంబ సభ్యులను పరామర్శించా రు.