MLA Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉ న్న తెలంగాణలో కాంగ్రెస్ అధికా రంలోకి రాగానే హింస, నేరాలు పెరి గిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరో పించారు. కొల్లాపూర్ నియోజకవ ర్గంలోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్‌ఎస్ కేడర్‌పై జరిగిన దాడే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వస్తే మార్పు వ స్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పు డు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పు తూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్‌లో అమలు చేయిస్తోం ది. సాతాపూర్‌లో బీఆర్‌ఎస్ కార్య కర్తలు, నాయకులపై దాడి జరిగి ఒక రోజు గడవక ముందే నార్యా నాయక్ తండాలో కాంగ్రెస్ గూండా లు రెచ్చిపోయారు.
ప్రజాస్వామ్యం లో ఇలాంటి దాడులు గర్హనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అను చరుల దాడులు పెరిగిపో తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు ప్రతిపా ర్టీకి ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయ డం ప్రతిపక్షాల కర్తవ్యం. బీఆర్‌ఎస్ ఈ పనులు చేస్తుంటే కాంగ్రెస్‌కు జీర్ణం కావడం లేదు. తమ వైఫల్యా లు ప్రజలకు తెలిస్తాయని భయప డుతూ దాడులుకు పాల్పడు తున్నది. బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ.
ఇలాంటి ఎన్నో అణచివేతలను ఎదుర్కొని నిలిచింది. దాడులకు, కేసులకు మా కార్యకర్తలు భయప డరు. బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. పోలీ సులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమ కర్తవ్యం నిర్వ హించాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్‌రావు తెలిపారు.