— మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
MLA Komati Reddy : ప్రజా దీవెన, మునుగోడు: భారత దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేప డుతున్నామని మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. చండూరు మున్సిపా లిటీ పరిధిలోని బంగారు గడ్డలో నూతనంగా మంజూరైన ఐకెపి ఆ ధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారం భించి మాట్లాడారు.అనంతరం చం డూరు మున్సిపాలిటీలో పేద ప్రజ లకు నాణ్యమైన ఆహార భద్రత కbల్పించడానికి ప్రజా ప్రభుత్వం ప్రbతిష్టాత్మకంగా చేపట్టిన పేదల కు సన్న బియ్యం పంపిణీ కార్యక్ర మంలో పాల్గొని అర్హులైన లబ్ధిదా రులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 16 నెలల కాలంగా రై తుల కు రుణమాఫీ చేసాం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించామని , 200 యూనిట్ల వ రకు ఉచిత కరెంటు, సిలిండర్ పై రూ. 500 సబ్సిడీ తదితర పథకాల ను విజయవంతంగా కొనసాగిస్తు న్నామని తెలిపారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డికి, సివిల్ సప్లై మంత్రి ఉ త్తంకుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల తరఫున మునుగోడు నియోజకవ ర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవా దాలు తెలిపారు.
గత ప్రభుత్వంలో ఉప ఎన్నిక వస్తే నే రేషన్ కార్డులు ఇచ్చారని, కానీ మా ప్రజా ప్రభుత్వంలో ఉప ఎన్ని కలు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తా మని, రాబోయే రోజుల్లో పింఛన్లు రేషన్ కార్డులు, పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ఆక్రమంగా మ ద్యం అమ్మిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపులు మూసివేసిన చాటు మాటుగా మద్యం అమ్మే వాళ్లను ఉపేక్షించము కేసులు పెట్టించి జైలు కు పంపిస్తామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. తప్పు చే సిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, మేము ఎప్పు డూ ధర్మం వైపే పని చేస్తాం ధర్మం వైపే ఉంటామని స్పష్టం చేశారు.