— మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
MLA Komati Reddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సమ స్య ను పరిష్కరించాలని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. మునుగోడు నియోజకవ ర్గం లో త్రాగునీటి సమస్యపై న ల్గొండ యాదాద్రి జిల్లాలకు చెందిన మిషన్ భగీరథ అధికారులు, ము నుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో కలిసి మునుగోడు లోని క్యాంపు కార్యాల యంలో శనివారం సమీక్ష సమా వేశం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థా యిలో ఎదుర్కొంటున్న సమస్యల ను ఆయా మండలాల నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గానికి మి షన్ భగీరథ నీరు అందించే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పాయింట్లైన లిం గోటం, ఉదయ సముద్రంల నుండి ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీరు సరఫరా అవుతుంది సరఫరా అయ్యే నీరు పూర్తిగా ప్రజలకు చేరుకుంటుందా లేదా ఎన్ని వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ప్లాంట్ల నుండి వాటర్ ట్యాంకులకు సరఫరా అయ్యే పైపులైన్ల కనెక్టివిటీ, వాటర్ హెడ్ ట్యాంక్ నిండిన తర్వాత గ్రామాలలోని ప్రతి నివాసానికి సరఫరా చేసే అంతర్గత పైప్ లైన్ల కనెక్టివిటీ ఎంత మేరకు ఉంది అనే ఇత్యాది అంశాల గురించి జిల్లాల వారీగా మండలాల వారీగా మిషన్ భగీరథ అధికారులను అడిగి తెలు సుకున్నారు.
గ్రామపంచాయతీలలో ఉన్న పాత ట్యాంకులకు రంగులు వేసి మిషన్ భగీరథ ట్యాంకులుగా మార్చారని వీటిలో బోరు నీళ్లు మిషన్ భగీరథ నీటిని నింపుతున్నారని, ఈ విధా నానికి స్వస్తి పలికి మిషన్ భగీరథ ట్యాంకులను వేరుచేసి శుద్ధి చేసిన నాణ్యమైన తాగునీటి అందించా లని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి లభ్యత వనరులను పెంపు, పంపుల కెపాసిటీ పెంపు, కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణాలను చేపట్టాలి, మునుగోడు నియోజకవ ర్గంలో ప్రత్యేకంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయడానికి ఇంట్రా పైప్ లైన్ ని నిర్మించుకోవాలని వీటి కి కావలసిన ప్రపోజల్స్ ను తయా రు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటి సరఫరా, స్టోరేజీ, ట్యాం కుల క్లీనింగ్, నల్లాలకు కంట్రోల్ వా ల్సు తీయకుండా చూడడం, మిష న్ భగీరథ బోర్ నీళ్లు కలవకుండా చూడడం వంటి విషయాలలో గ్రా మపంచాయతీ సెక్రటరీలు బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవే క్షించేలా చర్యలు చేపట్టాలని యా దాద్రి నల్గొండ జిల్లాల పంచాయతీ అధికారులకు ( డి పి వో లకు)ఫోన్ చేసి చెప్పారు.
ఈ వేసవిలో తాగునీటి కొరతను అధిగమించడానికి ప్రతి మండలం లో అవసరమైన చోట బోర్లు వేసి సమస్యను వెంటనే పరిష్కరించాల ని స్థానిక నాయకులను ఆదేశించా రు. సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటి కప్పుడు త్రాగునీటి సమస్య రాకుం డా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా మిషన్ భగీరథ ఎస్ ఈ నాగే శ్వరరావు, యాదాద్రి జిల్లా ఎస్ఈ కృష్ణయ్య, మిషన్ భగీరథ ఈఈ లు డీఈలు, ఏఈలు, వివిధ మం డలాల ముఖ్య నాయకులు పాల్గొ న్నారు.