Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Komati Reddy Rajagopal Reddy : జానారెడ్డిది ధృతరాష్ట్రుని కౌగిలి

–నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు

–జానా లేఖతోనే మంత్రివర్గ విస్త రణ మరింత ఆలస్యం

–అధిష్ఠానం ఇస్తానంటే అందరికీ ముచ్చెమటలు పడ్తున్నయ్‌

–లేనిపోని కొర్రీలతో ఇలా జరుగు తుంటే కోపమొస్తోంది

— మునుగోడు ఎమ్మెల్యే కోమటి రె డ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

MLA Komati Reddy Rajagopal Reddy : ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి : మహాభారతంలో ధర్మరాజులా ఉం డాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగో డు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతూ సంచలన వ్యాఖ్య లు చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన కొందరు కీలక నాయకు లు అడ్డుపడుతున్నారని ప్రత్యక్షం గా, పరోక్షంగా తన అన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డిని సైతం ఉటంకిస్తూ అరోపణలు గుప్పించారు. పదహా రు మాసాలుగా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో పదవులన్నీ ఖా ళీగా ఉన్నాయని, మంత్రి పదవులు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాయ డంతో విస్తరణ మరిoత జాప్యమ వుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ల మార్కెట్‌ కమిటీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార కార్యక్ర మాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తీవ్ర అసహనంతో రాజకీ య విమర్శలు గుప్పించారు. కొంద రు నాయకులు దుర్మార్గంగా వ్యవ హరిస్తున్నారని, జానారెడ్డి తన సొంత ఉమ్మడి నల్లగొండ జిల్లాను వదిలిపెట్టి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు మంత్రి పదవులను ఇ వ్వాలని అనడం విచిత్రంగా ఉంద న్నారు. తాను మంత్రి పదవి కోసం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధార పడలేదని, పైరవీకారులను పక్కన పెట్టాలని కోరారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఏ మంత్రి గెలి పించారని ప్రశ్నించారు. ఆ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ పార్టీ చాలామంది మంత్రులను రాష్ట్రంలోని పార్లమెం ట్‌ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా పెట్టిందని, భువనగిరి పార్లమెంట్‌కు మాత్రం మంత్రి ఇన్‌చార్జిగా రాలే ద ని, ఒక ఎమ్మెల్యేను పార్టీ ఇన్‌చా ర్జి గా పెట్టిందని పేర్కొన్నారు. తనకు మంచి పేరు, గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్‌చార్జిగా పెట్టారని ప్ర శ్నించారు. గెలిపించే సత్తా ఉందనే కదా తనకు బాధ్యత అప్పగించార ని చెప్పారు.

 

 

బాధ్యతను తూచా తప్పకుం డా నిర్వర్తించా… ‘ఇచ్చిన మాట ను నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్‌చార్జిగా పెడితే అభ్యర్థిని గెలిపించినం కదా, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, మెదక్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రె స్‌ గెలిచిందా ఈ మంత్రులంతా ఎక్కడికి పోయిండ్రని రాజగోపాల్‌ రెడ్డి నిలదీశారు. భువనగిరి ఎంపీ గా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని 2.25 లక్షల మెజార్టీతో గెలిపించాన ని తెలిపారు. ప్రతిపక్షాలతో కొట్లాడే శక్తి, సామర్థ్యం ఉన్న వారికి మంత్రి పదవి ఇవ్వడం సముచితమని, త నకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నిక లకు ముందు పార్టీ అధిష్ఠానం హా మీ ఇచ్చిందని తెలిపారు. అధిస్ఠా నం మంత్రి పదవి ఇస్తానంటుంటే కొందరికి చెమటలు పడుతున్నా యన్నారు. తాను మంత్రి పదవి కోసం పైరవీలు చేయడం లేదని, రాజగోపాల్‌రెడ్డి అర్హుడనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి కానీ ఏదో రిజర్వేషన్‌ కోటాలో కాదని, మాటి చ్చారని కాదని పేర్కొన్నారు.

మంత్రి పదవి వస్తే నల్లగొండతో పాటు రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు, ప్రభు త్వానికి మంచి పేరు తీసుకువ స్తాడని, మంచి పనులు చేస్తాడనే ఆలోచనతో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను పదవి కోసం అడుక్కునే పరిస్థితిలో లేనని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రె స్‌ ఎంపీల్లో తాను ఒకడినన్నారు. తన విషయంలో కొందరు నాయకు లు దుర్మార్గంగా మాట్లాడుతున్నా రని పేర్కొన్నారు. దారిన పోయే దానయ్యకు పదవిస్తే కొట్లాడతాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అనే వ్య క్తిని గద్దె దింపేవరకు నిద్రపోనని చెప్పిన తాను బీజేపీలో ఉన్నా సరే మళ్లీ వెనకడుగు వేసి కాంగ్రెస్‌లోకి వచ్చి గద్దె దింపానా లేదా అని అ న్నారు.

 

 

అధిష్టానానికి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం… తన సోదరుడు కో మటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలంగాణ కో సం మంత్రి పదవిని త్యాగం చేయ గా, తాను తెలంగాణ కోసం పార్ల మెంట్‌లో కొట్లాడానని, తెలంగాణ కోసం కొట్లాడిన అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పా అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. తన ను చూసి కొందరు భయపడుతు న్నారని, ప్రాణం పోయినా రాజగో పాల్‌ రెడ్డి తప్పు చేయడని స్పష్టం చేశారు. మునుగోడు నుంచి గతం లో ఎవరికీ మంత్రి పదవి రాలేదని, మంత్రి పదవి ఇస్తే వెనకబడిన ఈ ప్రాంతం మరింతగా అభివృద్ది చెం దేందుకు అవకాశం ఉంటుంద న్నా రు. ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మె ల్యేలు గెలిస్తే ముగ్గురికి మంత్రి పద వులు ఇచ్చినప్పుడు, నల్లగొండ జిల్లాలో 11 మంది గెలిచిన ప్పుడు తనకెందుకు మంత్రి పదవి ఎందు కు ఇవ్వరని ప్రశ్నించారు. నా ఓపి క, సహనాన్ని పరీక్షించొద్దని అ న్నా రు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన లో తీ వ్ర నిర్లక్ష్యానికి గురైన ఉమ్మడి జిల్లా లోని సాగు, తాగునీటి ప్రాజె క్టుల ను నీటి పారుదల శాఖ మంత్రి ఉ త్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీ సుకుని పూర్తి చేయిస్తున్నారని, రాష్ట్రాన్ని అభి వృద్ధి పథంలో నడి పించేందు కు సీఎం రేవంత్‌ రెడ్డి అ విరళ కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.

ఎంపీ చామల కిరణ్‌కు మార్‌రెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధి ష్ఠానం హామీ ఇచ్చిందని గుర్తు చే శారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌రె డ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్‌ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం సము చితమని అన్నారు. ఎమ్మెల్యే వే ముల వీరేశం మాట్లాడుతూ రాజ గోపాల్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఎంపీ చామల అధిష్ఠానానికి చెప్పా లని కోరారు.