
— మీ వ్యాపారం కోసం ప్రజల ఆరో గ్యాలు పాడు చేయొద్దు
–నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రై వ్ కేసులు పెంచుతాం
— మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి త నదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజ కవ ర్గంలో మద్యం దుకాణాల (wine s) సమయపాలనలో ఎమ్మెల్యే వి ధించిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తా జాగా మద్యం షాపుల వేళల్లో తా ను విధించిన నిబంధనల విషయం లో తన అభిమతాన్ని పునరుద్ఘా టించారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు మరో సారి వైరల్ అవు తున్నాయి.
మునుగోడు నియోజకవర్గంలో కొ నసాగుతున్న మద్యం షాపుల స మయపాలన లో మార్పు ఉండబో దని మరోమారు స్పష్టం చేశారు. ఆ దివారం మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలవ డానికి వచ్చిన కొంతమంది మద్యం వ్యాపారులతో మద్యం షాపుల స మయపాలన పై మధ్య నియంత్రణ పై వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.
మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరో గ్యాలు పాడుచేయొద్దని, ఉదయం నుండి మద్యం తాగే విధానానికి స్వ స్తి పలికేలా మద్యం వ్యాపారులు త మ మైండ్ సెట్ మార్చుకోవాలని హి తవు పలికారు. మునుగోడు నియో జకవర్గంలో మద్యం షాపుల విష యంలో తాను తీసుకున్న నిర్ణయం లో ఎలాంటిమార్పు ఉండదన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో అనుమతి ఉండాలని అన్నారు. అవసరమైతే నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఇంకా పెంచుతామని, ఉదయమంతా పని చేసుకొని సాయంత్రం పూట మాత్ర మే తాగేలా మార్పు తీసుకొస్తున్నా మన్నారు.
మద్యం విషయంలో తాము తీసు కొస్తున్న ఈ మార్పుకు ఇతర నియో జకవర్గాల నుండి మంచి నిర్ణయం అవలంబిస్తున్నారని ఫోన్లు వస్తు న్నాయని తెలిపారు. మద్యం విచ్చ లవిడిగా లభ్యం అవ్వడం వల్ల పను లు మానేసుకొని అదేపనిగా తాగు తూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పె రుగుతుందని, యువత మద్యానికి బానిసై పెడదొవ పడుతున్నారని గు ర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనలు మద్యం వైపు నుండి తమ వ్యక్తిగత అభివృద్ధి వై పు మళ్లిస్తూ గ్రామాలలో ఆరోగ్యకర మైన వాతావరణ నెలకొల్పడానికే ఈ ప్రయత్నం అన్నారు. ఎట్టి పరి స్థితులలో మునుగోడు నియోజకవ ర్గంలో మద్యం షాపుల సమయపా లనలోనూ మద్యం నియంత్రణ వి షయంలోనూ రాజీపడే ప్రసక్తే లేద ని మద్యం వ్యాపారులకు తెగేసి చె ప్పారు. దీంతో మద్యం వ్యాపారు లు మరోమారు ఖంగుతిన్నారు. చే సేది లేక అక్కడి నుంచి ఉసూరు మంటూ వెనుదిరిగారు.




