— రోడ్డు వెడల్పు పనుల సమీక్షలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Komatireddy Rajgopal Reddy : ప్రజా దీవెన మునుగోడు: మునుగో డు నియోజకవర్గం చండూరు ము న్సిపాలిటీలో జరుగుతోన్న అభి వృ ద్ధి పనులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మున్సిపల్ అధి కారులు, స్థానిక నాయకులు, రోడ్డు వెడ ల్పులో ఆస్తులు కోల్పోతున్న యజ మానులతో కలిసి మునుగో డు లోని తన వ్యక్తిగత క్యాంపు కా ర్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చండూరు పట్ట ణంలో నిలిచిపోయిన 400 మీటర్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు నిలిచి పోవడానికి కారణాలు పరి ష్కరించి వెంటనే పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. దీం ట్లో భాగంగానే తక్షణమే పెండింగ్ లో ఉన్న 400 మీటర్ల రోడ్డు వెడ ల్పుకు సెంట్రల్ లైన్ ఫిక్స్ చేసి మా ర్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి అ ధికారులను ఆదేశించారు.
రెండు కిలోమీటర్ల పొడవుతో చండూరు పట్టణంలో కొనసాగుతు న్న రోడ్డు వెడల్పు పనులు 1600 మీటర్ల పొడవు వరకు పూర్తయ్యా యి. మిగిలిన 400 మీటర్ల రోడ్డు వెడల్పు విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్ని ఫీట్ల వరకు రోడ్డు వేయొచ్చు, ఆ తర్వా త రోడ్డు వెడల్పులో ఇరువైపులా ఎంతమంది ప్రైవేట్ ఆస్తులు కో ల్పోయే అవకాశం ఉందనే విష యాలకు సంబంధించి సమగ్రమైన రిపోర్టు అందజేయాలని అధికా రులను ఆదేశించారు.
మనం శాశ్వతం కాదని మనం చేసే అభివృద్ధి శాశ్వతమని ఇప్పు డు చేసే రోడ్డు వెడల్పు పనులు రా బోయే 25 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలకు పనికొస్తాయని అన్నా రు. రోడ్డు వెడల్పు అభివృద్ధిలో ఆ స్తులు కోల్పోయే వారికి వీలైనంత వరకు ఎవరికి నష్టం కాకుండా చే స్తానని హామీ ఇచ్చారు.ఈ రెండు కిలోమీటర్ల రోడ్డు వెడల్పు అభివృ ద్ధి పనులే కాకుండా భవిష్యత్తులో 6 కిలోమీటర్లు ఉన్న చండూరు మున్సిపాలిటీ పరిధి వరకు రోడ్డు ను అభివృద్ధి చేస్తానని హామీ ఇ చ్చారు. చండూరు పట్టణంలో 60 ఫీట్ల వెడల్పుతో అంతర్గత రహదా రులను అభివృద్ధి చేసుకోవాలని వీటితో పాటు రాబోయే 25 సంవ త్సరాలకు సరిపడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తో పాటు మౌలిక సదుపా యాలు అభివృద్ధి చేసుకోవాల న్నారు.
ఈ సమీక్ష సమావేశంలో చండూ రు మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈ ఈ సత్యనారాయణ, షాపులు కోల్పో తున్న యజమానులు, చండూరు నాయకులు పాల్గొన్నారు.