MLA Komatireddy Rajgopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, భూనిర్వాసితు ల కోసం కడవరకూ కోట్లాడుతా
MLA Komatireddy Rajgopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా భూమికి రై తుకు మధ్య బావోద్వేగ బంధం ఉం టుందని, ఇది చాలా సున్నితమైన అంశమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొ న్నారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రహదారి కింద భూములు కోల్పో తున్న భూ నిర్వాసితులకు న్యా యం జరిగే కడవరకు కొట్లాడు తా నని కీలక వ్యాఖ్య చేశారు. ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భాగం రహదారి పరిధి లోని ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
ఆర్ఆర్ ఆర్ దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గం లో భూములు కోల్పోతున్న చౌటు ప్పల్ పట్టణం, చౌటుప్పల్, నారా యణ్ పూర్, గట్టుప్పల్, మర్రిగూ డెం మoడ మలాలకు చెందిన భూ నిర్వాసితులు శుక్రవారం మునుగో డులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా భూ నిర్వాసితులు దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మా ర్చారని, దివిస్ కంపెనీ కి లాభం చే కూరేలా రైతుల పొట్ట కొడుతున్నార ని రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొ చ్చారు. భూ నిర్వాసితులు, భూమి పోతే జీవనమే పోతుందని మాకు న్యాయం చేయాలని కోరుతూనే భూమికి భూమి ఇవ్వడమే మా ని నాదం అని భూనిర్వాసితులు ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకొ చ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపా ల్ రెడ్డి మాట్లాడుతూ భూమి కోల్పో తున్న బాధలో మీరు పడుతున్న ఆ వేదనకు మీరు చేస్తున్న డిమాండ్ల తో నేను ఏకీభవిస్తున్న అని చెప్పా రు. పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్ర జలే ముఖ్యం అనే బావనతో ఆ లోచన చేస్తున్నానని గుర్తు చేశారు.
భూ నిర్వాసితులకు న్యాయం చే యడానికి ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భా గం రహదారి వెళ్తున్న నియోజకవ ర్గాల శాసనసభ్యులతో కూడా మా ట్లాడుతునాన్నని,ఈ విషయంలో అందరు ఎమ్మెల్యేలూ ఆవేదనతో వున్నారని వివరించారు.
అధికార పార్టీ లో ఉన్నప్పటికీ ప్ర జల పక్షాన మాట్లాడతానని, పదవి అంటే కిరీటం కాదు పదవి అంటే బాధ్యత అని, రాజ్ గోపాల్ రెడ్డి ఎల్లప్పుడూ దర్మం వైపు, న్యాయం వైపు ఉంటాడని భావోగ్వేదంతో స్పష్టం చేశారు. దాదాపు సగం ము నుగోడు నియోజకవర్గం ఆర్ ఆర్ ఆర్ లో కలుస్తుందని, అలైన్ మెం టు మార్చడానికి కారణాలను రైతు లకు వివరించి, ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని పరీక్షంగా ప్రభుత్వా నికి సూచించారు.
ప్రతిపక్షాలు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తున్నాయని, మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు కడవరకు ఉండాలని సూచించారు.2017 లో శివన్న గూ డెం ప్రాజెక్టు ను ప్రారంభించారు, కా నీ పరిహారం మాత్రం 2023 లో నే ను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారని గుర్తు చేశారు.
ఆర్ ఆర్ ఆర్ రహదారి పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలందరం క లిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతామని, భూ నిర్వా సి తులకు ఎన్ని పార్టీలు అయినా ఉం డని, మీకు నాయ్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నామని తెలిపా రు.చౌటుప్పల్ వరకు వచ్చేసరికి ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ దగ్గరికి తీ సుకొచ్చారని, ఉత్తర భాగంలోనే అ లైన్ మెంట్ విషయంలో తప్పు జ రి గిందని, ఇపుడు దక్షిణ భాగంలో కూడా ఆ తప్పును కొనసాగిస్తున్నా రని వ్యాఖ్యానించారు.