–తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
MLA Mandula Samal: ప్రజా దీవెన తుంగతుర్తి: భూ భార తి చట్టం ద్వారా పేదల భూములకి భద్రత ఏర్పడిందని తుంగతుర్తి ఎ మ్మెల్యే మందుల సామెల్ అన్నా రు.శనివారం సూర్యాపేట డివిజన్ పరిధిలోని తిరుమలగిరి ఎ ఎస్ ఆర్ పంక్షన్ హాల్,నాగారం మండ లం ఫణిగిరి ఆనంద్ గార్డెన్ పంక్షన్ హాల్ లో భూ భారతి చట్టం 2025 పై అవగాహన సదస్సు కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాం బాబు తో కలిసి తుంగతుర్తి ఎమ్మె ల్యే మందుల సామెల్ జ్యోతి ప్రజ్వ లన చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూ భారతి చట్టం అమలు లోనికి తీసుకొని రావటం జరిగింద ని భూమికి రైతుకి విడదీయరాని అనుబంధం ఉందని,కానీ గత పాల కులు పేదవారి సొంత భూమికి వా రు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా ధరణి పేరుతొ భూములు దోచుకున్నారని నేడు భూ భారతి చట్టంతో ధరణి దరిద్రం వదిలింద ని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటి స్థలాలకి పాస్ పుస్తకాలు ఇ వ్వబోతున్నామని, రైతు భరోసా, రుణ మాఫీ, సన్న రకం వడ్లకి బో నస్ ఇలా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని 2024 ఆగస్టు 1 న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ సి వర్గీకరణ చేశామని, కుల గణన చేపట్టి 56 శాతం ఉన్న బి సి లకి ప్రాధాన్యత నిస్తూ స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని,తెలంగాణ లో ప్ర తి పేద వారు సన్నబియ్యం బు వ్వ తినేలా ఉగాది పండుగ రోజు నుం డి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబి య్యం ఉచితంగా అందజేస్తు న్నా మని తెలిపారు.
పేద ప్రజల భూములను కాపాడే భూ భారతి చట్టం తీసుకొచ్చిన ప్ర భుత్వాన్ని ప్రజలు అందరు అశ్వి రదించాలని అన్నారు. అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు మాట్లాడుతూ తెలంగా ణ ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబే ద్కర్ గారి జయంతి రోజున భూ భారతి చట్టం అమలులోనికి తీసు కొని రావటం జరిగిందని తదుపరి రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయి లో రెవిన్యూ సిబ్బందికి అవగాహన క ల్పించటం జరిగిందని ఇప్పుడు మండల స్థాయి లో ప్రజలకి చట్టం పై అవగాహన తెచ్చేందుకు 23 మండలాలలో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో అవగాహన సదస్సు లు నిర్వహిస్తామని పేర్కొ న్నారు.
ధరణిలో చాలా సమస్యలు పరిష్క రించలేనివి ఉన్నాయని ప్రతి సమ స్య కలెక్టర్ ద్వారా గానీ కోర్టు ద్వా రా గానీ పరిష్కరించే విధంగా ఉం డేదని ప్రతి ఒక్కరు గ్రామం నుండి సూర్యాపేట వచ్చి సమస్య పై దర ఖాస్తు ఇవ్వాలంటే ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉండేదని కానీ భూ భా రతి చట్టం ద్వారా అధికారం వికేం ద్రికరణ జరుగుతుందని సమస్యని బట్టి తహసీల్దార్, ఆర్ డి ఓ, కలెక్టర్ స్థాయి లో పరిష్కరించవచ్చని త్వ రలో గ్రామ స్థాయి లో భూ సమస్య లు పరిష్కరించేందుకు 279 గ్రా మ పరిపాలన అధికారి (జి పి ఓ) నియమించబోతున్నారని తెలిపా రు. ఈ సమావేశంలో తహసీల్దార్లు హరిచంద్రప్రసాద్,బ్రహ్మ్మయ్య, ఎం పి డి ఓ లు మారయ్య,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చామంతి, వైస్ చైర్మన్ వెంకన్న,పి ఎ సి ఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ప్రజా ప్రతినిధులు,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.