Tirumalagiri CM public meet : 14 న తిరుమలగిరి లో జరిగే సీఎం సభను విజయవంతం చేయాలి.. ఎమ్మెల్యే మందుల సామేల్..
Tirumalagiri CM public meet : శాలిగౌరారం జులై 3 : కాంగ్రెస్ ప్రజా పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శాలిగౌరారం లోని ఒక ఫంక్షన్ హాల్లో ఈ నెల 14 న తిరుమలగిరి లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసే సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని,మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ను గత పది సంవత్సరాలు ఏలిన కెసిఆర్ అప్పుల రాష్ట్రంగా దివాళా తీయించిన సీఎం రేవంత్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడన్నారు. ఆరు గ్యారెంటీలను అంచెలంచలుగా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేయూత నిస్తుందన్నారు.
40 ఏళ్ల నుంచి ఏబిసిడి ఎస్ సి వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు జరిగాయని, సీఎం రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ కు మద్దతు తెలిపి అమలు అయ్యేటట్లు చేయడం గర్వకారణ మన్నారు.10 సంవత్సరాలనుంచి రేషన్ కార్డుల మంజూరీ లేక ఎంతోమంది పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నామన్నారు. ఈ నెల 14 న తిరుమలగిరి లో నూతన రేషన్ కార్డుల పంపిణి ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.సీఎం సభకు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేల్ కోరారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా,సింగల్ విండో ఛైర్మెన్ తాల్లూరి మురళీ,జిల్లా కార్యదర్శి గూని వెంకటయ్య,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్,బీసీ సెల్ అధ్యక్షులు నోముల రవి కుమార్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్,ఎస్ సి సెల్ అధ్యక్షులు బోడ అరుణ్ కుమార్,యూత్ నాయకులు షేక్ ఇబ్రహీం,బందెల శ్రీను,నాయకులు భూపతి వెంకన్న,షేక్ ఇంతియాజ్ అహ్మద్,నోముల జనార్దన్, చింత ధనుoజయ్,దండ అశోక్ రెడ్డి, వడ్లకొండ పరమేష్ గౌడ్, బెల్లి వీరభద్రం, కట్టంగూరి సురేందర్ రెడ్డి,పుల్లూరి దేవేందర్, ననుబోతు అంజయ్య వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.