Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Nenavat Balu Naik : అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం

— ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలకు కృషి చేస్తాం

–దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

MLA Nenavat Balu Naik : ప్రజా దీవెన, నల్లగొండ :అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అం దించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసనస భ్యుడు బాలు నాయక్ హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా దేవర కొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసి న ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప లువురు గ్రామానికి చెందిన 200 మంది లబ్ధిదారులకు రూ. 80లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల ను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మా ట్లా డుతూ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిధి అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

వైద్యo ఖర్చులు నిమి త్తం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజురైనా చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిం దని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న పేదలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదర స్వభావాన్ని చూపిస్తు న్నారని అన్నారు. గత ప్రభుత్వం లో వాళ్ల పార్టీ వాళ్ళకే ప్రభుత్వ పథకాలు అందేవి అని,ప్రజా ప్రభు త్వంలో నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులు అందరు వినియోగిం చుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ని పేద, బడుగు, బలహీన, సామ న్య, మధ్యతరగతి పిల్లలకు అంత ర్జాతీయ ప్రమాణాలతో కూడిన వి ద్యను అందించడానికి యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మాణం చేస్తు న్నా మని , అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రి యను వేగవంతం చేస్తామని చెప్పా రు.

 

 

రేషన్ కార్డుల ద్వారా వారికి ని త్యావసర వస్తువుల సరఫరా చే యడం ద్వారా వారి జీవన ప్రమా ణాలు మెరుగుపర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించా రు. ఇండ్లకు అర్హత పొందిన పేద కు టుంబాలకు గృహాల కల్పనలో ప్రా ధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుం టున్నామని అన్నారు. ఇప్పటికే ని ర్మాణంలో ఉన్న ఇంటి పథకాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి సెంటు గుంటలు సాగునీరు అందించడం నా ప్రధాన లక్ష్యం. అనంతరం దేవరకొండ, చం దంపేట, డిండి మండలాల కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చె క్కులను స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. కళ్యా ణాలక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. మా ప్రభుత్వం సం క్షేమ పరిపాలనకు నిదర్శనం. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదు. ఈ పథకాల ద్వారా ఆర్థిక సహా యాన్ని అందించడంతో పాటు, ప్ర తి అమ్మాయి జీవితాన్ని వెలు గు లు నింపేలా చేయడం మా లక్ష్యం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ శిరాజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, శిరందాస్ కృష్ణయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి,మాజీ ఎంపీపీలు జాని యాదవ్, బిక్కు నాయక్, మేకల శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీలు మారుపాకల అరుణ సురేష్ గౌడ్, బుజ్జి లచ్చిరామ్ నాయక్, మాస మంజుల భాస్కర్, హరి నాయక్, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యూనుస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఉట్కూరి వేమన్ రెడ్డి, బాధ్య నాయక్, నాగభూషణం, రాజేష్ రెడ్డి, కృష్ణయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు తిపార్థి రుక్మా రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హన్మంతు వెంకటేష్ గౌడ్, యుగేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు పాప్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ ఎంపీటీసీ, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర గౌతమి రాంసింగ్ నాయక్, మాజీ కౌన్సిలర్ పొన్నబోయిన భూదేవి సైదులు, తహసీల్దార్ సంతోష్ కిరణ్, అధికారులు,మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.