Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLA Rajagopal Reddy : ఎమెల్యే రాజగోపాల్‌రెడ్డి మళ్లీ ఆస క్తికర వ్యాఖ్యలు, ప్రతిపక్షాలపై విమ ర్శలుమాని ప్రజలపై దృష్టి సారించండి

MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగా ణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలని, అధికారంలో ఉ న్న వ్యక్తిగా బాధ్యతతో వ్యవహరిం చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రె డ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఆ యన తీవ్ర అసంతృ ప్తి వ్యక్తం చే శారు. సీఎం రేవంత్ తన భాష మా ర్చు కోవాలి, ప్రతిపక్షాలపై విమర్శ లు మానేయాలి, ప్రభుత్వం ఏం చే స్తోంది? ఏమి చేయబోతుంది? ప్రజ లకు చెప్పాలని అన్నారు.

మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నాతో హామీ ఇచ్చింది. ఇది వెంకట్ రెడ్డికి తెలియకపోవ చ్చన్నారు. మాకు పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారు, కానీ మేం కలిసి ఉండటంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. తెలంగాణను ఇప్పుడు సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారoటూ రేవంత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గె ట్ చేశారు.

రేవంత్ రెడ్డి కమిషన్ల పేరిట కాల యాపన చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతిపై నిజమైన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఇంకా మూడున్నరేళ్లపాటు రేవంత్ సీఎం అవుతారు గానీ, వాగ్దానాలకు వ్య తిరేకంగా పాలిస్తే ప్రజలు సమాధా నం చెబుతారన్నారు.

బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో ఉంది. ప్రతిపక్షంగా వా ళ్లు బలహీనంగా మారారు.ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చే యాలoటూ రాజగోపాల్ రెడ్డి డి మాండ్ చేశారు. కాగా ఈ వ్యా ఖ్య లు, కాంగ్రెస్‌ లోపల వున్న సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలను మరో సారి బయటపెట్టినట్టయ్యాయి. మంత్రి పదవుల విషయంలో అసం తృప్తి ఉన్నా పార్టీకి మద్దతుగా ఉం డబోతున్నానని రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే ఆయన ప్రభు త్వాన్ని టార్గెట్ చేయడం కాంగ్రెస్ లో ఆంతర్య సంక్షోభాన్ని సూచించే దిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పం దించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, పాలన తీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వంలో బలమైన ప్రాతినిధ్యం కోరుతూనే, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అం శాలపై ఆందోళన వ్యక్తం చేశారు