MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, కబ్జాచెరలోని చెరువులకు వెంటనే హద్దులు ఫిక్స్ చేయాలని ఆర్డీవోకు ఆదేశం
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: నీరుసక ల కోటి ప్రాణాలకు జీవనాధారమ ని మనిషి జీవన విధానం చెరువు ల చుట్టూ అల్లుకుoదని మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మంగళవారం ఉదయం మునుగో డు మండలంలోని సోలిపురంలో సమస్యలు తెలుసుకోవడానికి మా ర్నింగ్ వాక్ చేశారు.కబ్జాలకు గురైన సోలిపురం చెరువును పరిశీలించా రు.
మునుగోడు నియోజకవర్గంలో వర్ష పు నీటి పైన ఆధారపడి రైతాంగం వ్యవసాయం చేసుకుంటారని, వర్ష పు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలా లు పెంచుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను అభి వృద్ధి చేసుకోవలసి ఉందన్నారు.
గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినప్పటికీ కాంట్రాక్టర్లు తూతు మంత్రంగా పైపైనే పనులు చేసి వెలకోట రూపాయలు దండు కున్నారని, గ్రౌండ్ లెవెల్ లో మిషన్ కాకతీయ పనులు సక్సెస్ కాలేద న్నారు. ప్రతి చినుకుని ఒడిసి పట్టు కొని చెరువులు నిండేలా చేసుకుం టే నిండిన చెరువు ద్వారా మూడు నాలుగు సంవత్సరాల వరకు వ్యవ సాయం చేసుకోవచ్చని, చెరువులు నిండుగా ఉండటం వల్ల భూగర్భ జ లాలు కూడా పెరుగుతాయని అ న్నారు. కబ్జాకు గురైన చెరువు భూములను సర్వే చేయించి హద్దు లు నిర్ణయించాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తం గాచెరువుల పునర్నిర్మాణంలో అం దరూ భాగస్వామ్యం కావాలని పి లుపునిచ్చారు. చెరువులను అభి వృద్ధి చేసుకునే బాధ్యత గ్రామస్తు లకే అప్పగిస్తామని చెరువుల పూ డిక మట్టి తీయడం కట్టను పటిష్టం చేయడం అలుగుల మరమ్మత్తులు చేయడం వల్ల వ్యవసాయానికి ద న్నుగా ఉంటుందన్నారు.
పూడిక మట్టిని రైతులు తీసుకెళ్లి తమ పొలాలలో చల్లుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని అధికా రులకు చెప్పారు. మార్నింగ్ వాక్ లో గ్రామంలోని పలు సమస్యలను గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అన్నింటిని విడతల వారీగా పరిష్క రిస్తామన్నారు.సోలిపురం వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన ఆ యన గ్రామాల్లోని చిన్నచిన్న సమ స్యలకు ప్రతిసారి పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దని , గ్రామ పెద్దలందరూ కూ ర్చొని మాట్లాడి సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. మనం బ్రతకాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్రతకాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని కొనసా గించాలన్నారు.
ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టే షన్లో చుట్టూ తిరగడం వల్ల సమ యం ఖర్చు వృధా అవుతుందన్నా రు.గ్రామస్తులు అందరూ కలిసిక ట్టుగా చెరువుల పునర్నిర్మాణ య జ్ఞంలో పాలుపంచుకోవాలని పిలు పునిచ్చారు.ఈ పర్యటనలో ము నుగోడు మండల నాయకులతో పాటు చండూరు ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు ఇన్చార్జి తహసిల్దార్ నరేష్, ఇంచార్జ్ ఎంపీడీవో విజ య భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి, సర్వేయర్ నాగేశ్వర రావు లు పాల్గొన్నారు.