—నల్లగొండ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిదవుతుంది
— రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
MinisterKomatiReddyVenkatReddy: ప్రజాదీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దు తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను అందించాలన్న లక్ష్యం తో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొ దటిది కావాలన్నారు. 9 నెలల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజ నీరింగ్ అధికారులను ఆయన ఆదే శించారు. సోమవారం నల్లగొండ జి ల్లా కేంద్రం సమీపంలోని గంధంవారి గూడెంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల పనులకు మంత్రి భూ మి పూజ నిర్వహించారు.
నల్గొండ జిల్లాలోని విద్యార్థుల భవి ష్యత్తుకు సంబంధించి చేపట్టిన బృ హత్తర పాఠశాల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల అని, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో ఇలాంటి పాఠశాలల ను డిజైన్ చేసి నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలోనే నల్గొండ యంగ్ ఇండియా రెసిడెన్షి యల్ పాఠశాల మొదటిదని, ఇది రికార్డు కావాలన్నారు.రాష్ట్ర ముఖ్య మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొ డంగల్ తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని అంతకన్నా బాగా తీర్చి దిద్దాలని చెప్పారు.
రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఉ న్నాయని, నల్గొండ లో అన్ని హం గులతో మహాత్మా గాంధీ విశ్వవిద్యా లయం ఉందని, నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా మార్చడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం లో ఇటీవలే ఎం ఫార్మసీ, ఎల్ఎల్ బి కోర్సులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో అం తర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి డ్యుకేషన్ హాబ్ గా తీర్చిదిద్దుతామ న్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్య మని, విద్యార్థులు చదువుపైనే దృ ష్టి సారించాలని, మధ్యలో బడి మా నివేయవద్దని అన్నారు.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల మం ది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యనభ్యసిస్తు న్నార ని, వారందరినీ ఇలాంటి ఉత్తమమై న పాఠశాలల్లో చదివించి వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిం చే విధంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, విద్య, ఉ పాధిలో తెలంగాణ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోనిలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంతు న్నదని తెలిపారు. ప్రస్తుతం నల్గొం డలో బాలికలను ఉద్దేశించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాల మంజూరు కాగా,
బాలురకు కూడా ఇలాంటి పాఠశా ల నిర్మాణానికి చర్యలు తీసుకుం టామన్నారు.
నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడు తూ తమ నియోజకవర్గంలో కూడా త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కు భూమి పూజ చేయనున్నట్లు తె లిపారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడు తూ నల్గొండ యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను 25 ఎకరాలలో నిర్మించనున్నామని, ఈ పాఠశాలలో మంచి ఫ్యాకల్టీ తో పాటు, అన్ని వెసులుబాట్లు ఉంటా యని, పాఠశాల భవనాలు నిర్మా ణం వేగవంతంగా పూర్తి చేసేందుకు అడ్వాన్స్ గా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాగార్జునసా గర్ నియోజకవర్గానికి సంబంధించి న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు మంచి స్థలాన్ని గుర్తించ డం జరిగిందని, త్వరలోనే అక్కడ శంకుస్థాపన పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పాఠశా లల్లో చదివిన విద్యార్థులు ప్రొఫెష నల్ గా తయారవ్వడానికి అవకాశం ఉంటుందని, ఈ పాథసాల విద్యా ర్థుల జీవితాల్లో ఎంతో ఉపయో గపడుతుందని తెలిపారు.టి జి ఈ డబ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, నల్గొండ లో నిర్మిస్తున్న యుంగ్ ఇండియా రెసిడె న్షియల్ పాఠశాల వివరాలను తెలి యజేశారు.
అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నా రాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, విద్యాశాఖ అధికారి బిక్షపతి, టిజి ఈ డబ్ల్యు ఐడిసి డిఈ శైలజ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.