MLA Rajanna : ప్రజా దీవెన నాంపల్లి : రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన మునుగోడు లోని క్యాంప్ ఆఫీసులో నాంపల్లి ప్రెస్ క్లబ్ ఏడవ వార్షికోత్సవం పురస్కరించుకొని సందర్భంగా డైరీ 20 25 ఆవిష్కరించారు ప్రభుత్వం జర్నలిస్టులకు బీమా మరియు ఆరోగ్య భీమా 10 లక్షల రూపాయల వరకు అందించుటకు ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు అందుకు జర్నలిస్టులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన పనిలేదని సూచించారు ముఖ్యంగా నియోజకవర్గంలోని నాంపల్లి మండలం మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు మండల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రోడ్లు బస్సులు సౌకర్యం ఏర్పాటుకు నా దృష్టికి ప్రతిరోజు తేవడం వల్ల మునుగోడు నియోజకవర్గంలో అన్ని రూట్లో కలిపి ఆరు బస్సులు ఏర్పాటు చేశామని ఇంకా కొన్ని బస్సులు ఏర్పాటు చేయాలని పాత్రికేయ మిత్రులు నాకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు .
నాంపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గురుపాదం మండల అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నాడని మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ హాస్పిటల్ 30 పడకలు ఏర్పాటుకు నాకు వినతి పత్రాలు ప్రజల తరఫున అందిస్తున్నారని గురుపాదం సేవలు ఇకముందు కూడా నాంపల్లి మండలానికి కాకుండా నియోజకవర్గం స్థాయిలో అందించాలని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుపాదం ను అభినందించారు డైరీ ఆవిష్కరణ సందర్భంగా గౌరవ అధ్యక్షులు గురుపాదం మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామా లను రోడ్లు బసౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు నాంపల్లి మండల కేంద్రం నుండి మల్లేపల్లి వరకు రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి నారాయణరెడ్డి పెద్దిరెడ్డి రాజు మండల కాంగ్రెస్ నాయకులు సర్దార్ నాయక్ దీప్లా నాయక్ జర్నలిస్టులు గడ్డం వెంకటేశ్వర్లు కామిశెట్టి యాదయ్య తదితరులు పాల్గొన్నారు