MLA Samel : ప్రజా దీవెన శాలిగౌరారం ఏప్రిల్ 2 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చివరి గింజ వరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ రైతలు నాణ్యమైన ధాన్యం ను దళారులకు విక్రయించకుండా మార్కెట్ కు తీసుక వచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. చివరి గింజ వరకు రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్టంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
ఈ కార్యక్రమం లో నల్గొండ ఆర్ డి ఓ యానాల అశోక్ రెడ్డి,తహసీల్దార్ పి. యాదగిరి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి,శాలిగౌరారం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, సింగల్ విండో ఛైర్మెన్ తాళ్లూరి మురళి,పి ఏ సి ఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు,మార్కెట్ కమిటీ కార్యదర్శి చీనానాయక్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్,సింగల్ విండో వైస్ ఛైర్మెన్ సీఎం రెడ్డి,మండల వ్యవసాయధికారి సౌమ్య శృతి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గైగుళ్ల అవిలయ్య,కుతాటి సోమయ్య,తాందారి సత్తయ్య,పడాల రమేష్,దేవరకొండ జయరాజ్,షేక్ లతీఫ్,బోడ దానయ్య,లక్ష్మినర్సింహా రెడ్డి,రాజుల శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపినాథ్, కార్యదర్శి పోల్దాస్ నరేష్ సింగల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.