Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC Kavitha warning : ఎమ్మెల్సీ కవిత కస్సుబుస్సు, నోటి కొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను

MLC Kavitha warning : ప్రజా దీవెన హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ పార్టీకి పక్కలోబల్లెం మాదిరిగా అయ్యిం దా అంటే అవుననే సమాధానం ప్ర తి ఒక్కరి నోటి నుండి ఇట్టే బయ టకొస్తుంది. ఆ మధ్యలో ఏకంగా బిఆర్ఎస్ కేంద్ర నాయకత్వం పైనే బాణం ఎక్కుపెట్టిన కవిత తాజాగా జిల్లా నాయకులపై దృష్టి సారించిం ది. తనపై ఆరోపణలు చేసిన బీఆర్ ఎస్ నేతలు, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారె డ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి లపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆమె మాట్లా డారు.

 

నల్లగొండ లిల్లీపుట్ నా గురించి మా ట్లాడతారా అంటూ ఎమ్మెల్సీ కవిత ఓ రకంగా ఘాటు పదాలతో విరు చకపడ్డారు. కవిత ఎవరని నల్ల గొండ లిల్లీపుట్ నాయకుడు మా ట్లాడుతున్నాడుగా ఆ జిల్లాలో బీ ఆర్ఎస్ నాశనం కావడానికి కారణ మే ఆ లిల్లీపుట్ నాయకుడు అం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ ఆ ర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎవరు, నా గురించి మాట్లాడుతున్నాయన చా వు తప్పి కన్నులొట్టబోయినట్లు చి వరి నిమిషంలో అనుకోకుండా గెలి చాడన్నారు. ఎన్నడూ ప్రజాఉ ద్య మాలు చేయలేదని, ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారు, పి ల్ల నాయకుడు కూడా ఎటుపడితే అటు మాట్లాడుతున్నాడని మండి పడ్డారు. అసలు మీరు ఎవరు, తె లంగాణ ఉద్యమంతో మీకేం సం బంధం, మీ మీదనే కదా మేం కొ ట్లాడింది. పార్టీలో చేరి పదవులు పొంది ఉల్టా నామీదనే మాట్లాడు తారoటూ మండిపడ్డారు.

 

తనపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లోని ఓ పెద్ద నేత హస్తం ఉన్నదని కవిత ఆ రోపించారు. తనను కించపరిచేలా మాట్లాడితే యావత్ తెలంగాణ బా ధపడిందని, కానీ బీఆర్ఎస్ లోని ఒక్కరు కూడా స్పందించలేదని అ న్నారు. ‘ఆ పెద్ద నేత నా దగ్గర అ త ని మనుషులను పెట్టి సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామ ని చావు తెలివితేటలు ప్రదర్శిస్తు న్నారని కానీ అక్కడ ఏం జరుగు తుందో కూడా నాకు సమాచారం వస్తుందన్నది ఆ పెద్ద నాయకుడికి అర్థం కావాలని పేర్కొన్నారు.

 

మీరు ఏ సమయంలో ఎవరిని కలి శారో, ఎవరిని ప్రోత్సహించారో, నా పై కించపరిచే వ్యాఖ్యలు చేయిం చారో ఇవన్నీ తాను గమనిస్తున్నాన ని స్పష్టం చేశారు. భయపడే వ్యక్తిని కాదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తే ఊరుకునేది లేదని హెచ్చ రించా రు. తాను కేసీఆర్ కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయింది తన కు తెలుసునన్నారు.

 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పించ కుండా కాంగ్రెస్, బీజీపీ కలి సి నాటకాలు ఆడుతున్నాయని క విత ఫైర్ అయ్యారు. ఆర్డినెన్సుపై బీజేపీ స్పష్టమైన నిర్ణయం తీసు కో వడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పై రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మాట్లాడలేదని, వీరు అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెం ట్ ఇవ్వరా అని ప్రశ్నించారు. తెలం గాణ జాగృతి ఆధ్వర్యంలో రేపటి నుంచి చేసే 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వా లని కవిత డిమాండ్ చేశారు.