Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MODI: రణభూమిలో మోదీ

— ఉక్రెయిన్‌ కు చేరుకున్న ప్ర‌ధాని మోదీ
–10 గంటల పాటు రైల్ లోనే ప్రయాణం
–భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచిన ఉక్రెయిన్
–కీలక చర్చలు జరపనున్న మోదీ, జెలెన్ స్కీ

MODI: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయి న్‌లో ప్రధాని మోదీ (MODI) చారిత్రక పర్య టన మొదలైంది. పోలండ్ పర్యట నను ముగించుకున్న ఆయ‌న‌ అక్క డి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ కు రైల్లో చేరుకున్నారు. రైల్ ఫోర్స్ వన్ రైల్లో దాదాపు 10 గంటల పా టు ప్రయాణించి కీవ్‌లో అడుగు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు (President of Ukraine) జెలె న్ స్కీ ఆహ్వానం మేరకు భార‌త ప్ర‌ ధాని ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కీవ్ లోని రైల్వే స్టేషన్‌లో మువ్వ న్నెల పతాకాలతో భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లోని ఇస్కాన్ బృందం కూడా స్వాగత కార్యక్రమం లో పాల్గొంది.

మోదీ టూర్ (Modi tour) వివ‌రాలు గోప్యం.. భద్రతా కారణాల కార ణంగా ప్ర‌ధాని మోదీ పర్యటనలోని కార్యక్రమాల వివరాలను గోప్యంగా ఉంచారు. ఉక్రెయిన్ స్థానిక కాల మానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు మోదీ కీవ్‌కు చేరుకు న్నారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆయన కాన్వాయ్ మోదీ బస చేసే హయత్ హోటల్‌కు చేరుకుంది. హోటల్ వద్ద భారత సంతతి ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. ఉక్రెయిన్ లో మోదీ పర్యటన దాదాపు ఏడు గంటల పాటు జరగనుంది.

తన పర్యటనలో భాగంతో కీవ్‌లోని ఏవీ ఫొమిన్ బొటానికల్ గార్డెన్‌లో (Botanical Garden) మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి నివాళి అర్పించ‌నున్నారు. 2020లో గాంధీ 151వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నేషనల్ మ్యూజియంను మోదీ సంద ర్శించనున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లను మ్యూజి యంలో ఆయన వీక్షించనున్నారు. రష్యా దాడిలో ప్రాణాలు కోల్పోయి న చిన్నారులకు ఇక్కడ మోదీ నివా ళి అర్పించనున్నారు. అనంతరం మరిన్ స్కీ ప్యాలెస్‌కు మోదీ వెళ్తా రు. అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Jelen Ski) స్వాగతం పలుకుతారు. ఈ ప్యాలస్‌లో ఇద్దరూ కలిసి ప్రైవే ట్ మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ లు జరుప‌నున్న‌ట్టు తెలు స్తోంది.