Modi is stubborn: మోదీ మీది మొండిచెయ్యి
-- రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి అదే చూపించిపోతారు -- నేడు పాలమూరులో కూడా పునరావృతమవుతుంది -- వచ్చిన ప్రతిసారి తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతారు -- నల్లగొండలో మీడియా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
మోదీ మీది మొండిచెయ్యి
— రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి అదే చూపించిపోతారు
— నేడు పాలమూరులో కూడా పునరావృతమవుతుంది
— వచ్చిన ప్రతిసారి తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతారు
— నల్లగొండలో మీడియా సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చేయి చూపడంలో ఉత్తములని ( Prime Minister Narendra Modi is best at showing stubbornness) తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి తెలంగాణకు మొండి చెయ్యి చూపి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారిందని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాజాగా రాష్ట్రంలో ని పాలమూరు జిల్లా పర్యటనకు మోదీ విచ్చేస్తున్నారని, మళ్లీ అదే మొండి చేయి చూపడంతో తో పాటు తెలంగాణపై అక్కసు వెలగక్కే కార్యక్రమాలు సర్వసాధారణంగా ( Programs that focus on Telangana are common) జరిగిపోతాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని( Palamuru Ranga Reddy project should be given national status), బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి ఇవ్వరనీ, మిషన్ కాకతీయ పథకం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వరని ఎంత సేపు తెలంగాణ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు.
మోడీ అప్పుడప్పుడు రాష్ట్ర పర్యటన మూలంగా తెలంగాణ కు ఒరిగేది ఏమీ లేదని, ఇప్పటికైనా కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ మీదే ఆరోపణలు చేస్తున్నారని ( The state governor is accusing the state government) గవర్నర్ పై ఎవ్వరు రాళ్లు వేయడం లేదని, ఆమె మాత్రం పదేపదే ఆవేదన పడుతున్నారని, సదరు ఆవేదనకు అర్థమేమిటో ఎవ్వరికి తెలియడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వం లో నల్లగొండ జిల్లాలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని వివరించారు.
ఐటీ, మున్సిపల్ మంత్రి KTR నల్లగొండ లో పర్యటిస్తున్నారని (IT and Municipal Minister KTR is visiting Nalgonda), ఐటీ హబ్ తో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి కెసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ వల్లనే నల్లగొండ జిల్లా కేంద్రం అందమైన నగరంగా అభివృద్ధి జరిగిందని వివారించారు.