Modi: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: విమర్శలు, వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్ పథకం'(‘Agniveer Scheme’)పై మోదీ (Modi: )సర్కార్ దిద్దు బా టు చర్యలకు ఉపక్రమించింది. అర్హతలు, పారితోషకాలతోపాటు, మరికొంతమంది అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించేలా మార్పులు ఉండబోతున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పథకం మరింత మెరుగుకు అవసరమైన సవరణలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ’25శాతం మందికి ఫుల్‌టైమ్ సర్వీస్ ఇవ్వటం.. క్షేత్రస్థాయిలో ఉన్న డిమాoడ్‌కు సరిపోదు. నాలుగేండ్ల శిక్షణ తర్వాత అగ్ని వీర్లలో 50శాతం మందిని ఫుల్ టైమ్ సర్వీస్‌కు (For full time service) ఎంపికచేయా లని సైన్యం సిఫారసు చేసింది’ అని రక్షణ శాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సైన్యం తన సిఫారసులను అందజేసినట్టు తెలిసింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.