Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi new laws: కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతం

–పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూ చనలను కేంద్రంపట్టించుకోలేదు
–దేశ వ్యాప్తంగా వున్న సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు
–కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకం
— మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

Modi new laws: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా జులై 1 వ తేదీ నుండి అమల్లోకి రానున్న క్రిమినల్ ప్రొసీజ ర్ కోడ్,ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టా లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ద్వజ మెత్తారు. కేంద్ర ప్రభుత్వం (Central govt)రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువస్తుందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ చట్టాలు వున్నాయని, మార్పు అంటే మంచి జరగడంకానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా వున్నాయని దుయ్యబట్టారు. ఆదివారం తెలంగాణ భవన్ (Telangana bhavan(లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బి ఆర్ ఎస్ నేతలు సోమ భరత్ కుమార్,గెల్లు శ్రీనివాస యాదవ్,లలిత రెడ్డి లతో కలిసి మాట్లాడారు. 2023 ఆగస్టు లో చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపె ట్టిందని, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేశారని గుర్తు చేశారు.దాదాపు 16 0 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుందని,దేశ వ్యాప్తంగా వున్న సీనియర్ న్యాయ వాదులు కొత్త చట్టాలను వ్యతిరేకి స్తున్నారని, కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖా మం త్రి,న్యాయ శాఖా మంత్రులకు లేఖ రాశానని చెప్పారు. చట్టాలను ఇంగ్లీ ష్ లో ప్రవేశపెట్టాలని రాజ్యంగంలో వుందని, కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ కు భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టారని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు భారతీయ నాగరిక సురక్షసంహిత అనే పేరు పెట్టారని, కొత్త చట్టాలకు హిందీ,సంస్కృతంలో పేర్లు పెట్టారని, కొత్త చట్టాల పేర్లు దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా వున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్లు ఆందోళన చేయవద్దని అన్ని బార్ అసోసియే షన్స్ కు (association)లేఖలు రాశారని, మోడీ తె చ్చిన నల్ల చట్టాలతో రైతులు చని పోయారని, చట్టాల మార్పులను వాయిదా వేయాలని మోదీని డిమాండ్ (demand)చేస్తున్నామని తెలిపారు . ఎఫ్.ఐ.ఆర్ ను రిజిస్టర్ చేయకుం డా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధం గా కొత్త చట్టం తెచ్చారని, స్టేషన్ బెయిల్ ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరో పించారు.దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుందని, కొత్త చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయని, చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది,ఇప్పుడు కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని వుంది,
కొత్త చట్టాల (new laws)వలన భాదితుడికి అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు.పోలీస్ కస్టడీకి తీసు కోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చా రని, బార్ కౌన్సిల్ ను మోడీ మోసం చేశారని, కొత్త చట్టాలకు వ్యతిరే కంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్
దాఖలు చేస్తున్నా కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పం దించాలని కోరారు.కొత్త చట్టాలపై సుప్రీం కోర్టు జోక్యం చేకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.