–నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో మోదీ
Modi: ప్రజా దీవెన, బీహార్: ప్రపంచంలోనే భారత్ ను విశ్వజ్ఞాన కేంద్రంగా అతి త్వరలో తీర్చిదిద్దుతామని ప్రధాన మంత్రి మోడీ (Modi) పునరుద్ఘాటించారు. ఉన్నత స్థాయిలోని విజ్ఞాన కేంద్రం గా భారత్ తిరిగి నిలపడటమే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించా రు. బిహార్ (Bihar) లోని నలంద యూని వర్సిటీ (Nalanda University) నూతన క్యాంప్ సను బుధ వారం ఆయన ప్రారంభించారు. భా రతీయ జ్ఞాన వారసత్వానికి నలంద చిహ్నమని, దేశాల మధ్య వారధిలా అది నిలబడి ఉందని తెలిపారు. నలంద కేవలంపేరు కాదని, అదొక తారకమంత్రమని వ్యాఖ్యానించా రు. పుస్తకాలను తగలబెట్టవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు అనేందుకు నలంద అస్థిత్వమే తిరుగులేని నిద ర్శమని పేర్కొన్నారు. మరికొద్ది రోజు ల్లో జరుపుకోబోతున్న ప్రపంచ యోగా దినం ప్రస్తావన తెస్తూ ప్రపం చానికి తన సంస్కృతిని భారత్ అందిస్తూనే ఉందన్నారు. భారత్ ను విశ్వ జ్ఞాన కేంద్రంగా నిలపడం లో భాగంగా ఇప్పటికే తమ ప్రభు త్వం కసరత్తు ప్రారంభించిందని వివరించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్లు కోటి మందికి పైగా పిల్లలకు సాంకేతిక విషయాలను నేర్పిస్తు న్నాయనీ, చంద్రయాన్, గగన్యాన్ మిషన్లు వారి జిజ్ఞాసను పెంచుతు న్నాయని మోదీ వివరించారు. ఇది లా ఉండగా 12వ శతాబ్దంలో మగ ధపై దండెత్తిన ఆఫ్ఘాన్లు నలంద వర్సిటీని ధ్వంసం చేశారు. విధ్వంస చరిత్రకు నిదర్శకంగా నలందలో మిగిలిన శిథిల భాగాలను మోదీ బుధవారం పరిశీలించారు. కొత్తగా నలందలో నెలకొల్పిన క్యాంపస్ ను నెట్ జీరో పద్దతిలో గ్రీన్ క్యాంపస్ (green campus) రూపంలో దీనిని తీర్చిదిద్దారు. వం ద ఎకరాల్లో విస్తరించిన క్యాంప్సిలో సోలార్ ప్లాంట్లు (Solar plants), నీటి శుద్ధి కేంద్రా లు, జల పునర్వినియోగ ప్లాంట్లు, చెరువులు, ఇతర పర్యావరణ అనుకూల ఏర్పాట్లు ఉన్నాయి.
కాశ్మీర్లో అంతర్జాతీయ యోగా డే.. ఈ నెల 21 ప్రపంచ యోగ డే (World Yoga Day సందర్భంగా దాల్ సరస్సు ఒడ్డున 7వేలమందితో కలసి యోగాలో ప్రధాని మోదీ (pm modi) పాల్గొననున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కాశ్మీర్ లో జరుపు కోవాలని ప్రధాని మోడీ నిర్ణయిం చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభు త్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. యోగాడేను ఘనంగా నిర్వహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పా ట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) జమ్మూ కశ్మీర్ నిర్వహించనున్న కార్యక్ర మంలో పాల్గొననున్నారు. దాల్ సరస్సు ఒడ్డున మోదీ యోగా చేయనుండగా ఆ కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొ నేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని పర్యవేక్షించిన జమ్మూకశ్మీర్ లెప్టి నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యోగా డే సందర్భంగా మోదీ కశ్మీర్ (kashmir) లోయ కు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజలతో మోదీకి మంచి అను బంధం ఉంది. అందుకే ఆయన ఇక్కడికి రావాలని నిర్ణయించుకు న్నట్లు తెలుస్తోంది. మోదీ రాక మాకెంతో గర్వకారణం. ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో ఆయన తో పాటు 7 వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. గత పదేళ్లలో జాతీయ, అంతర్జా తీయ వేదికలపై యోగా ఎంతో గుర్తింపు పొందింది. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో 23.5 కోట్ల మందికి పైగా పాల్గొన్నారు. ఏటా యోగా చేసే వారి సంఖ్య పెరగడం హర్షణీయం. ఒత్తిడి లేని ప్రశాంతమై న జీవితం కోసం ప్రజలు ఈ మార్గా న్ని ఎంచుకుంటున్నారు’ అని జ మ్మూకశ్మీర్ ఎలీ వెల్లడించారు. కాగా జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిస్తోంది. దీంతో ఈ నెల 29న ప్రారంభం కానున్న అమ ర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.