–కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు
–రాష్ర్టపతి, ప్రధాని, రక్షణ మంత్రి ప్రభుతులు
Modi: ప్రజా దీవెన, న్యూడిల్లీ : భారత భూభాగాన్ని (Indian territory) ఆక్రమించాలని ప్రయత్నిం చిన పాకిస్థాన్ సేనలను తరిమికొ ట్టిన భారత సైన్యం వీర పరాక్రమా నికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజ యగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు 25వ కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Divas) సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Raj Nath Singh)తదితర ప్రభుతులు ఘనంగా నివాళులర్పించారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి (President) ఎక్స్ వేదికగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.మన సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక విజయగాథ అని పేర్కొన్నారు. 19 99 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృ భూమి కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి జవాన్‌కు నివాళులర్పిస్తు న్నానని, వారి త్యాగం, శౌర్యం నుం చి దేశ ప్రజలంతా స్ఫూర్తి పొందు తారoటూ జై హింద్. జై భారత్ అని రాష్ట్రపతి రాసుకొచ్చారు. కార్గిల్ లోని ద్రాస్‌లో గల యుద్ధవీరుల స్మా రకాన్ని ప్రధాని మోదీ నేటి ఉదయం సందర్శించారు. యుద్ధంలో ప్రాణా లర్పించిన వీర సైనికులకు అంజలి (Anjali to the brave soldiers) ఘటించారు. ఈ సందర్భంగా అమ ర జవాన్ల సతీమణులు, కుటుంబ సభ్యులతో ప్రధాని కొద్దిసేపు ముచ్చ టించారు.ఇక, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమర జవా న్లకు నివాళులర్పించారు. అలాగే ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎ స్) జనరల్ అనిల్ చౌహాన్ అంజలి ఘటించారు. అమరవీరుల (Martyrs) త్యాగా లను వృథా కానివ్వబోమని పేర్కొన్నారు.