Monkeypox: మన భారత దేశంలో రోజురోజుకి మంకీపాక్స్ వైరస్ బారి స్థాయిలో వ్యాప్తి పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Monkeypox) వైరస్ సోకిన వారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నయాని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో (WHO) కూడా దీనిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటన కూడా చేసింది. ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది రెండోసారి. ఈ సమస్య పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతానున్నారు. ఇంతకీ మంకీ పాక్స్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పడూ చూద్దాం…
వాస్తవానికి మంకీపాక్స్ అనేది మశూచి వంటిది వైరల్ వ్యాధి. దీని పేరు కోతి వ్యాధి అయినప్పటికీ కోతులతో దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది స్మాల్ పాక్స్ కుటుంబానికి సంబంధించిన సమస్య. పరిశోధన కోసం ఉంచిన కోతులలో మశూచి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు 1958లో మంకీపాక్స్ (Monkeypox) వైరస్‌ను మొదటిసారిగా గుర్తించినట్లు నివేదికలలో మనం చూడవచ్చు. మంకీపాక్స్ వ్యాధి యొక్క మొదటి కేసు 1970లో నమోదు అయ్యింది.అనంతరం మళ్ళి మంకీపాక్స్ 2022లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
మంకీపాక్స్ (Monkeypox)ఎలా వ్యాపిస్తోంది అంటే.. గాలి ద్వారా వ్యాపించదు. ఇది రోగితో పరిచయం, సోకిన వ్యక్తి దద్దుర్లు లేదా కాచు నుండి నీరు, లైంగిక సంబంధాల ద్వారా త్వరగా వ్యాపిస్తుంది. ఈ సమస్య కలుషితమైన షీట్లు, తువ్వాళ్లు, బట్టల ద్వారా కూడా వ్యాపిస్తుంది అని నిపుణులు అంటున్నారు.
మంకీపాక్స్(Monkeypox) వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే జ్వరం, శరీరంపై దద్దుర్లు. ఈ సమస్య వచ్చినప్పుడు, మొదట ముఖం మీద దద్దుర్లు కనిపిస్తాయని, అనంతరం మొత్తం శరీరానికి వ్యాపించవచ్చని నివేదికలలో ఉంది . ఈ వైరస్ బారిన పడిన తర్వాత ఒక వ్యక్తికి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, శరీరంలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఇక మరి కొంతమందికి అయితే నోరు, గొంతు, కళ్ళు, ప్రైవేట్ భాగాలపై దద్దుర్లు కూడా రావచ్చు అని డాక్టర్లు తెలుపుతున్నారు.
మంకీపాక్స్(Monkeypox) వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ముందుగా దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా ఉండండి. సోకిన జంతువు లేదా వ్యక్తితో సంబంధం ఉన్న బట్టలు, షీట్‌లు, దుప్పట్లు (Clothes, sheets, blankets)లేదా ఇతర వస్తువులను తాకకుండా ఉండడం చాల మంచిది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీరు లక్షణాలను తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోవడం కూడా చాల ముఖ్యం అనే చెప్పాలి.