–ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారం భించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
MP Chamala kiran kumar Reddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామీణ ప్రాం తాల అభివృద్ధికి పెద్ద పీట వేసిం దని భువనగిరి పార్లమెంటు సభ్యు లు చామల కిరణ్ కుమార్ రెడ్డి అ న్నారు .మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఐదు లక్షల రూపాయ ల విలువగల ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చి ప్రారంభించిన సందర్భంగా ఎంపీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. సన్న బి య్యం, ఉచిత విద్యుత్తు ,ఉచిత బస్సు సౌకర్యం ,రైతుబంధు, రుణ మాఫీ ,లాంటి పథకాలను ప్రజలకు అందించారని అన్నారు .భువనగిరి పార్లమెంట్ పరిధిలో గల తుంగతు ర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జర గాల్సి ఉందన్నారు. ప్రాథమిక వైద్య శాలలో అరకురా వసతులు ఉన్నా యని రానున్న కాలంలో వాటిని పరిష్కరిస్తామని అన్నారు. తుంగ తుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజాదరణ కలిగిన వ్యక్తి అని అభి వృద్ధి పనులు చేయడం లో దిట్ట అ న్నారు. రానున్న కాలంలో తుంగ తుర్తి నియోజకవర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకె ళ్తామని అన్నారు.
తుంగతుర్తి శాసనసభ్యుడు మం దుల సామేల్ మాట్లాడుతూ తుంగ తుర్తి నియోజకవర్గంలో రాష్ట్ర ము ఖ్యమంత్రి రాష్ట్ర మంత్రుల సహకా రంతో ఇప్పటికే 1600 కోట్ల అభివృ ద్ధి పనులు మంజూరు చేయించడం జరిగిందని వివిధ రకాల పనులు కొ నసాగుతున్నాయని అన్నారు. ని యోజకవర్గం గత పది సంవత్స రాల కాలంలో అభివృద్ధి కుంటు పడిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏర్పడిన నాటి నుండి నియోజ కవ ర్గంలో అభివృద్ధి పనులు కొనసాగు తున్నాయన్నారు.
నియోజకవర్గం లో విద్య వైద్య రం గాలకు పెద్దపీట వేయాల్సి ఉందని అన్నారు. పేద ప్రజలకు కావాల్సిం ది ముఖ్యంగా మెరుగైన విద్య మె రుగైన వైద్యం అని అన్నారు. వాటి కోసం తాను అహర్నిశలు కృషి చే స్తానని అన్నారు. తుంగతుర్తి ని యోజకవర్గ కేంద్రంలో వంద పడ కల ఆసుపత్రి నిర్మాణం త్వరితగ తిని పూర్తయ్యేందుకు తను కృషి చేస్తానని అన్నారు .రానున్న కాలం లో తుంగతుర్తి నియోజకవర్గం అం దరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అండ గా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయా నంద్ వైద్యాధికారి డాక్టర్ నిర్మల్ కు మార్ ఎంపీడీవో శేషు కుమార్ నా యకులు గుడిపాటి నరసయ్య జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురా లు తిరుమల ప్రగడ అనురాధ కిష న్ రావు డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ చింతకుంట్ల వెంకన్న మాచర్ల అనిల్ కాస్ట్రో పెద్ద పోయిన అజయ్ కుమార్ దాసరి శ్రీను లతో పాటు పలు అధికారులు పాల్గొన్నా రు.