MP Etela Rajender : ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపు, తె లంగాణ మాదిరిగా ఆశయం సిద్ధిం చే వరకూ ఉద్యమం కొనసాగిద్దాం
MP Etela Rajender : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా అలాగే సా ధ్యమవుతుందని, ఆశయo సిద్ధిం చే వరకూ ఐక్యంగా ఉద్యమాలు కొ నసాగిద్దామని మాజీ మంత్రి, మ ల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ని జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ లలో బీసీల బంద్ లో ఆయన పా ల్గొని ప్రసంగిస్తూ స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీ సీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణం గా మద్దతు తెలిపిందని, అoదులో భాగంగానే ఈరోజు ఉదయం సికిం ద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ‘తె లంగాణ బంద్ బీసీ బంద్ లో పా ల్గొని మద్దతు తెలిపినట్లు పేర్కొ న్నారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వ యంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, అన్నీ తెలిసి నా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. పెరి యార్ మొదలు అనేక గొప్ప ఉద్య మాలు జరిగాయని అన్నారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు బీసీల ఆర్థిక, సామా జిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి ఆరిపోర్ట్ తో రాజ్యాం గం లో 9వ షెడ్యూల్ లో చేర్చారని గు ర్తు చేశారు. తెలంగాణలోనూ కేసీ ఆర్ ఒకసారి సర్వే చేసి బీసీ కమీ షన్ వేశారని, ఎన్ని వేసినా నిజాయి తీ లేదు కాబట్టి అమలు కాలేదని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పేరు కు కమిషన్లు వేశారని, అంతకు మిం చి నిజాయితీ మచ్చుకు కూడా లేద ని మండిపడ్డారు. లెక్కలైతే తీసారు కానీ అవన్నీ తప్పుల తడక అని వి మర్శించారు. 52 శాతం ఉంటే 42 శాతం అని కాకిలెక్కలు చెప్తున్నార ని మండిపడ్డారు. తాను చెప్పేది అ బద్ధమైతే రాజకీయాల నుంచి త ప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎ క్క డైనా చర్చకు సిద్ధమని అన్నారు. తా మెంత మంది ఉన్నామో తమ కు అంత కావాలని అన్నారు. యా చించే స్థాయిలో కాదు శాసించే స్థా యిలో బీసీలు ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయి నా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమం త్రి కాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలని కానీ, ముగ్గురే ఉన్నారని ధ్వజమెత్తారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖ లు చిన్నవేనని పేర్కొన్నారు. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నా మినేటెడ్ పోస్టుల్లో ఎందుకు బీసీల కు స్థానం కల్పించలేదని రాష్ట్ర ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని ప్రకటించిన ప్రధాని మోదీ క్యాబినె ట్ లో 27మంది OBC మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. బీజేపీ ని జాయితీని ఎవరు శంకించలేరని అ న్నారు. మాదిగ రిజర్వేషన్ చేస్తామ ని మాట ఇచ్చి ప్రధాని అమలు చేశారని గుర్తు చేశారు. తమిళనా డులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అ దే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యా లని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఈ బంద్ కి పిలుపు ఇచ్చిం ది బీసీ జేఏసీ అని అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థి తి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని చె ప్పారు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారని చెప్పుకొచ్చా రు. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదని, చట్టస భల్లోనూ వచ్చే వరకు పోరాటం ఆగ దని ఎంపీ ఈటెలరాజేందర్ పునరు ద్ఘాటించారు.