MP Chamala Kiran Kumar Reddy: ప్రజా దీవెన,శాలిగౌరారం: ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన లయన్స్ క్లబ్ సేవలు నేడు గ్రామీణా ప్రాంతాల్లో విస్తరించి వైద్య సేవలు అందించడంలో ఎంతో కృషి చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం శాలిగౌరారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యా పేట లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో శాలిగౌరారం గ్రామ పంచాయితీ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కంటి వైద్య శిబిరంను ప్రారంభించి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు వైద్య సేవలే పరిమితం కాకుండా ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు సంబధించిన సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. వివిధ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నరన్నారు.
లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సేవలను గ్రామీణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి, రోడ్ల మరమ్మత్తులకు, అన్ని గ్రామాలకు బస్ సౌకర్యం కలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ వైద్య శిబిరం లో దాదాపు 300 మందికి కంటి పరీక్షలు చేసి మందులు, అద్దాలు పంపిణి చేశారు. 50 మందికి ఆపరేషన్ చేయడానికి గుర్తించి మొదటి విడతగా 20 మందిని ఆపరేషన్ చేయడానికి సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్సు లో తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి ఛైర్మెన్,సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వుప్పల రాజేంద్రప్రసాద్,క్లబ్ రీజన్ ఛైర్మెన్ గుడిపూడి వెంకటేశ్వరరావు, జోన్ ఛైర్మెన్ రవీందర్ రెడ్డి,ప్రోగ్రాం చైర్మెన్, దాత చాడ రమేష్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, క్లబ్ పాస్ట్ జోన్ ఛైర్మెన్లు దేవరశెట్టి శ్రీనివాస్, ఎర్ర శంభు లింగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, పాస్ట్ ప్రసిడెంట్ మారం వేణుగోపాల్ రెడ్డి,క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డెంకల సత్యనారాయణ, మారోజు వెంకటాచారి, కోశాధికారి వడ్లకొండ బిక్షం,సభ్యులు సీఎం రెడ్డి, రామడుగు వెంకటరామ శర్మ,నిమ్మల వీరస్వామి, మురారిశెట్టి కరుణాకర్,జోగు శ్రీనివాస్, గండూరి విజయ,కప్పల శ్రీకాంత్, గుండు పరమేష్,కంటి ఆసుపత్రి ఇంచార్జ్ బాణాల వీరేంద్రాచారి, కంటి డాక్టర్ బంగారు స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు.