–మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చి న ఎంపీ మిధున్ రెడ్డి
–వైసీపీ, టీడీపీ నేతల మధ్య పర స్పర రాళ్ల దాడి
–దాడిలో పోలీసులకు గాయాలు భారీగా మోహరించిన పోలీసు బలగాలు
MP Midhun Reddy:ప్రజా దీవెన, పుంగనూరు: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు (Punganur)పట్టణంలో ఉద్రిక్త వాతావర ణం నెలకొంది. పుంగనూరులో ధ్వం సమైన షటిల్ కోర్ట్ ఇండోర్ స్టేడి యంను పరిశీలించడానికి రాజం పేట ఎంపీ వెంకట్ మిథున్ రెడ్డి (MP Midhun Reddy) పుంగనూరుకు రావడంతో గో బ్యాక్ మిథున్ రెడ్డి అంటూ రైతులు, టీడీ పీ నేతలు నిరసన తెలిపారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్న ఎం పీ మిధున్ రెడ్డి (MP Midhun Reddy) కలిసి నష్ట పరిహా రం ఇవ్వాలని కోరుతున్న నేప థ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాళ్ల దాడి మొద లైందిరాళ్ల దాడిలో టీడీపీ నేతలకు, రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పోలీసు లు గాయపడ్డారు. కాగా ఎంపీ మి థున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికెళ్లి కలిశారు. పోలీసుల (police) రంగప్రవేశంతో దాడి సద్దుమణిగిం ది. ఈ దాడిలో సుమారు 10 వా హనాలు ధ్వంసమయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగు తుందోనని చుట్టుపక్కల ప్రజలు భయాందోళ నలకు గురవుతున్నారు. నష్ట పరిహారం అడగడానికి వచ్చిన రైతులపై వైసీపీ నేతలే మా జీ ఎంపీ రెడ్డప్ప (MP Reddappa) ఇంటిలో నుండి రాళ్లు, కర్ర లతో విసిరారని ఆరోపిస్తున్నారు.