Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Vaddiraju Ravichandra : పాలేరు కదం తొక్కాలే, వరంగల్ దద్ధరిల్లాలే

— రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

MP Vaddiraju Ravichandra :ప్రజా దీవెన, తిరుమలాయపాలెం:బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భం గా ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పాలేరు నియోజ కవర్గం నుంచి పెద్ద ఎత్తున కదం తొ క్కాలని, గులాబీ సైన్యం కవాతుతో వరంగల్ దద్ధరిల్లాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపు నిచ్చారు. రజతోత్సవ సభకు స న్నాహకంగా గురువారం సాయం త్రం తిరుమలాయపాలెంలో పాలే రు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృ త స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన వద్దిరా జు రవిచంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కాం గ్రెస్ పాలన కేవలం ఏడాది లోనే ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయ ని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తాము ఏం కోల్పోయామో ప్రజలం తా గ్రహించారని అన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అత్యుత్సాహం ప్రదర్శించి, అడవులను ధ్వంసం చేసి సుప్రీంకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చిందన్నారు.

నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్య కర్తలపై పోలీసులు అత్యుత్సాహం చూపి.. కేసులు పెట్టి నిర్భంధాలకు గురిచేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించ బోతోందని, సభ్యత్వ నమోదు, గ్రా మస్థాయి కమిటీల నియామకం జ రపబోతోందని అన్నారు. రజతోత్స వ సభను సక్సెస్ చేయడంలో పాలే రు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్ర ముఖ పాత్ర పోషించాలని అన్నా రు.

పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు రాజ కీయాలకు అతీతంగా, ఎవరు వ చ్చినా పనులు చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనకు ప్ర స్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య తేడా ఏంటో ప్రజలందరికీ అర్థం అయ్యేలా చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణు లకు దిశా నిర్ధేశం చేశారు.

ఈ సభలో బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షులు తాతా మధు సూధన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, వైస్ చైర్మన్ మరికంటి ధనల క్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బాష బోయిన వీరన్న, బెల్లం వేణు, ఉ న్నం బ్రహ్మయ్య, వేముల వీర య్య, మాజీ ఎంపీపీలు బెల్లం ఉమా, మా జీ జెడ్పీటీసీ వరప్రసాద్ తదితరు లు పాల్గొన్నారు.