Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MPTC, ZPTC elections:నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఎ న్నికల పరిశీలకురాలు కొర్రలక్ష్మి

— మొదటి విడత ఎంపిటిసి, జడ్పి టిసిఎన్నికల నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన

MPTC, ZPTC elections:ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకు రాలుగా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి, కోర్ర లక్ష్మిని రాష్ట్ర ఎన్నిక ల సంఘం నియమించింది. ఈ మే రకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తో సమావే శ మై మొదటి విడత ఎన్నికలు జరగ నున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాల నామినేషన్ల నోటిఫికేషన్, నామినేష న్ల ఏర్పాట్లపై చర్చించారు.

ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచా యతీ ఎన్నికల సందర్భంగా ఎన్నిక ల ప్రవర్తన నియమావళిని పక్కగా అమలు చేసేందుకు తీసుకున్న చ ర్యలు, పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీ సీ నామినేషన్ కేంద్రాలలో ఏర్పాట్ల ను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్కు లు, రిటర్నింగ్ అధికారి చాంబర్, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుళ్లు, ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు.

అనంతరం కనగల్ ఎంపిడిఓ కా ర్యాలయంలో మొదటి విడత ఎం పిటిసి, జడ్పిటిసి నామినేషన్ల స్వీ కరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్ని కల సందర్భంగా మొదట విడత ఎ న్నికలు నిర్వహించనున్న ఎంపిటి సి, జడ్పిటిసి వివరాలను జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి సాధారణ పరిశీ ల కురాలు కొర్ర లక్ష్మికి తెలియజేశా రు.

నల్గొండ జిల్లాలో మొదటి విడతున నల్గొండ, దేవరకొండ డివిజన్లలోని 18 మండలాలు, 196 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చే యడం జరిగిందని, నోటిఫికేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశామని, నామినే ష న్ల సందర్భంగా పాటించవలసిన ని యమ, నిబంధనలను ఇదివరకే రా జకీయ పార్టీల ప్రతినిధులకు తెలి యజేయడం జరిగిందని, ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, నామినేషన్ కేం ద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో పా టించాల్సిన నియమ నిబంధనలు, నామినేషన్ వేసే సమయంలో అ నుమతించే వారి సంఖ్య, తదితర అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలి పామని చెప్పారు.

గురువారం నుండి నామినేషన్లు ప్రారంభమైనందున ఎఫ్ఎస్టి, ఎస్ ఎస్టి బృందాలు వాటి విధులను ప్రా రంభించాయని, ఎన్నికలను సక్ర మంగా నిర్వహించేందుకు అవస ర మైనంత సిబ్బందిని ముందే గు ర్తించి శిక్షణ ఇవ్వడం జరిగిందని, శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బం దులు కలవకుండా జిల్లా ఎస్పీ ద్వా రా భద్రతా ఏర్పాట్లు చేయడం జరి గిందని, జిల్లాలో ఎంపీటీసీ, జడ్పి టిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు వివరించారు.

ఇన్చార్జి డిఆర్ఓ, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి, స్థా నిక సంస్థల ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రాజ్ కుమార్, జడ్పి సీ ఈవో శ్రీనివాసరావు, డిపిఓ వెంక య్య, పరిశీలకుల నోడల్ ఆఫీ సర్ పశుసంవర్ధక శాఖ జిల్లా అధి కారి డాక్టర్ రమేష్ తదితరులు పా ల్గొన్నారు.