–ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణ మాదిగ
Manda Krishna Madiga MRPS : ప్రజా దీవెన,నల్లగొండ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి మీద దాడి దేశ ప్రజాస్వా మ్య విలువలపైనే దాడిగా పరిగణిం చాల్సి ఉంటుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. సు ప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి ఘట నపై నిరసనగా సోమవారం జిల్లా క లెక్టర్ కార్యాలయం ముందు తమ నిరసన తెలిపారు. అనంతరం జి ల్లా కలెక్టర్ ని కలిసి సమర్పించిన వి నతి పత్రం సమర్పించారు. అక్టోబర్ 7న సుప్రీం కోర్టు బెంచ్‌లో జస్టిస్ బీఆర్ గవాయి వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్య క్తి షూ విసరడం అనాగరిక చర్య అ ని ఆయన పేర్కొన్నారు.
దళితుడైన చీఫ్ జస్టిస్‌పై జరిగినఈ దాడి ప్రజాస్వామిక వ్యవస్థను, రా జ్యాంగాన్ని అవమానపరచే ప్రయ త్నం అని మంద కృష్ణ మాదిగ వ్యా ఖ్యానించారు. ఈ దాడి వెనుకఉన్న ఆధిపత్య శక్తులను గుర్తించి కఠిన శి క్షలు విధించాలని, ఈ ఘటనపై సు ప్రీం కోర్టు ప్రజాస్వామిక దృక్పథం క లిగిన సీనియర్ లేదా రిటైర్డ్ న్యా యమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చే శారు. అలాగే భవిష్యత్తులో ఇలాం టి సంఘటనలు ఉన్నత న్యాయ వ్యవస్థల్లో పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన భ ద్రతా చర్యలు తీసుకోవాలని కోరా రు.
దళితుల ఎదుగుదల జీర్ణించుకోలే ని కొన్ని శక్తుల కుట్రే ఈ దాడి అం టూ దేశ ప్రజలందరూ దీనిని తీ వ్రం గా ఖండిస్తున్నార ని మంద కృష్ణ గుర్తు చేశారు. సుప్రీం కోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడి పై త క్షణమే చర్యలు తీసుకోవాలని ఆ యన డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరే ష్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పా ర్టీ రాష్ట్ర నాయకులు జానకి రా మయ్య చౌదరి, మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకులు దైద సత్యం మాదిగ, ఎం జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగ, ఎ స్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీని వా స్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అ ధ్యక్షులు ఇరిగి శ్రీశైల మాదిగ, మా దిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్య క్షులు కూరపాటి కమలమ్మ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యద ర్శి తరి ఏడుకొండలు మాదిగ, న ల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, నల్లగొండ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న, జి ల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ, గాదె రాజు మాదిగ తది తరులు పాల్గొన్నారు.