Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mumbai Police: బ్రిడ్జిపై నుంచి దూకబోయిన మహిళ.. చివరికి ..!?

Mumbai Police: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు మనం సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇది ఇలా ఉండగా తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నవీ ముంబైలను కలిపే అటల్ బ్రిడ్జిపై గత కొన్ని రోజులుగా చాల మంది ఆత్మహత్యకు (sucide) సంబంధించిన కేసులు నమోదు అయితున్నట్లు పోలీస్ అధికారులు తెలుపుతున్నారు.

అయితే తాజాగా ఒక మహిళ బ్రిడ్జి (woman on bridge) పై ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదృష్టం బాగా ఉండి ఆ మహిళను రక్షించెందుకు పోలీస్ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక ఆ పోలీస్ అధికారులు ధైర్యం చూసి నెటిజన్స్ అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో (video)సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అటల్ సేతు సి లింక్‌లో ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అయితే విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు అలర్ట్ అయ్యి ఆ మహిళను కాపాడారు. పోలీసుల సమాచారం మేరకు ములుంద్‌ లో నివసిస్తున్న మహిళ ఫ్లై బ్రిడ్జి (bridge)పై నుంచి సముద్రంలోకి దూకెందుకు ప్రయత్నం చేసింది.

అక్కడికి చేసురుకున్న పోలీస్ ల సమాచారం మేరకు బ్రిడ్జికి (bridge) అవతలి వైపు 56 ఏళ్ళు గల మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు సముద్రం వైపుకు దూకుతుండగా అక్కడే ఉన్న ఒక పోలీస్ ఆమెను పట్టుకున్నాడు. ఆలాగే అదే సమయానికి అక్కడికి చేరుకున్న నవీ ముంబైకి చెందిన షేవా ట్రాఫిక్ పోలీసులు కూడా వెంటనే ఆ మహిళలను రక్షించారు. ఆ మహిళను కాపాడిన ట్రాఫిక్ పోలీసుల పేర్లను లలిత్ శిర్సాత్, కిరణ్ మాత్రే, యశ్ సోనావానే, మయూర్ పాటిల్ అని పోలీసుల (polcie) అధికారులు తెలియ చేసారు. ఇంకెందు ఆలశ్యం మీరు కూడా ఈ వీడియోను చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.