MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన, ప్రతి మండల కేంద్రంలో మొదటి విడతగా ఏడు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తా
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: బడి అం టే గుడి లాంటిదని గ్రామాలలో ఒ క్కొక్క కులానికి ఒక్కో గుడి ఉం టుందని కానీ ఊరందరికి ఒకే బడి ఉండడం వల్ల బడి గుడితో సమాన మని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతగా నియోజకవర్గ ప రిధిలోని ప్రతి మండల కేంద్రంలో ప్ర భుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థా యిలో అభివృద్ధి చేస్తానని, ప్రభు త్వం ద్వారా కొందరు వ్యక్తుల సహా య సహకారాల ద్వారా అభివృద్ధి చేసుకుందామన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయం లో రాజగోపాల్ రెడ్డి రాజీ పడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. మును గోడు నియోజకవర్గం గట్టుప్పల్ మండల కేంద్రంలో సరస్వతీ శిశు మందిర్ నూతన భవన ప్రారంభో త్సవ కార్యక్రమంలో ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించా రు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఆదర్శం ని యోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమని స్పష్టం చేశారు. సరస్వతి శిశుమందిర్ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో కట్టించిన ఇడెం శ్రీనివాస్ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యే కంగా అభినందించారు. ప్రతి ఒక్క రూ సమాజసేవ చేయాలనే తపన ఉండాలని సూచించారు. కుటుం బం కోసమే కాకుండా సమాజం కో సం కూడా ఆలోచన చేసినప్పుడే స మాజంలో పేదరికం అనేది ఉండద న్నారు.
భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆర్థి కంగా బలంగా ఉండి సమాజానికి సేవచేసే శక్తి ఉండి కూడా సమాజ సేవ చేయకపోవడం నా దృష్టిలో నే రమన్నారు. సహాయం చేయాలం టే వందలకోట్ల రూపాయలు అవ స రం లేదని సాయం చేయాలన్న మ నసు బుద్ధి ఉండాలన్నారు.ధనవం తులు, మేధావులు, చదువుకున్న వారు పేదల పక్షాన పని చేయాలని అప్పుడు పేద లకు కష్టాలు ఉండవ న్నారు.