MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, రాజకీయాల కం టే సామాజిక కార్యక్రమాలకే ఎక్కు వ సమయం కేటాయిస్తా
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన,మునుగోడు: మును గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ప్రభా విత ప్రాంతమని, ఇక్కడ ప్రజలు ఆ రోగ్యo విషయంలో జాగ్రత్తలు పాటి స్తూ కంటి ఆరోగ్యం విషయంలో చా లా జాగ్రత్తగా ఉండాలని మునుగో డు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సూ చించారు. తనకు రాజకీయాల కం టే సామాజిక కార్యక్రమాలు చేసే దాంట్లోనే ఎక్కువ సమయం కేటా యిస్తానని పునరుద్ఘాటించారు.
మునుగోడు మండలం కోదాబక్ష ప ల్లి గ్రామంలో పాశం ధర్మరెడ్డి జ్ఞా ప కార్థం ఆయన కుమారుడు పాశం కి రణ్ కుమార్ రెడ్డి, శంకర నేత్రాలయ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత కంటిపొర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించా రు. ఆ తర్వాత కంటిపుర సమస్య ఉన్నవారికి వెంటనే మొబైల్ ఆపరే షన్ థియేటర్ లో అక్కడే ఆపరేష న్ చేసే విధంగా ఏర్పాటుచేసిన మొబైల్ ఆపరేషన్ థియేటర్ ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ని యోజకవర్గ వ్యాప్తంగా 18 రెసిడెన్షి యల్ పాఠశాలలో మౌలిక సదుపా యాల నిర్మాణానికి శ్రీకారం చుట్టా మని గుర్తు చేశారు. ప్రభుత్వ నుండి వచ్చే నిధులను వాడుకుంటూనే నాతో పాటు దాతల సహాయంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రతి గ్రామంలో 10 మంది వరకు ధ నవంతులు ఉంటారని ఆ పది మం ది ధనవంతులు బయటికి వచ్చి గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు అంది స్తే పేదరికం అనేది ఉండదని గ్రా మాలన్నీ అభివృద్ధి చెందుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, జూకూరి రమేష్ గౌడ్, పాశం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.