MLA Rajagopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన, ఆర్ఆర్ఆర్ భూనిర్వాసితులకు న్యాయం కోసం వారితో కలిసి పోరాటం చేస్తాం
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన,మునుగోడు: ఆర్ ఆర్ ఆర్ దక్షిణ భాగంలో మునుగోడు ని యోజకవర్గం నుండి అత్యధికంగా రైతులు నిర్వాసితులవుతున్నార ని నేను కూడా రైతు కుటుంబం నుండి వచ్చానని రైతులు పడుతున్న క ష్టాన్ని కనులారా చూశానని భూమి కి రైతుకు మధ్య ఒక భావోద్వేగా అ నుబంధం ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రె డ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ ను టిఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఫై నల్ చేశారని గుర్తు చేశారు. ఇటీవ ల త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలై న్మెంట్ ను ప్రభుత్వం సూత్రప్రాయం గా ప్రకటించిన నేపథ్యంలో మును గోడు నియోజకవర్గంలోని చౌటు ప్పల్ నుండి మొదలవుతున్న త్రి బుల్ ఆర్ దక్షిణ భాగంలో భూము లు కోల్పోతున్న రైతులు ఆదివారం నారాయణపురం మండల కేంద్రం లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఆయన బాధి తు లకు న్యాయం చేసే వరకు మీ వెంటే ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఉ త్తర భాగంలో భూములు కోల్పోతు న్న నిర్వాసిత రైతులు కేంద్ర ప్రభు త్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లారన్నారు. దక్షిణభాగం అలైన్మెంట్ ప్రకటించే సందర్భంలో ఈ అలైన్మెంట్లో భూములు కోల్పో తున్న సంబంధిత శాసనసభ్యుల కు సమాచారం అందించి వారి స ల హాలు సూచనలు తీసుకుంటే బా గుండేదని అభిప్రాయపడ్డారు. అలై న్మెంట్ ప్రకటన మీలాగే నేను కూడా పేపర్ లో చూశానని చెప్పారు.
నిర్వాసితులు ఎదుర్కొంటున్న స మస్యలను రాష్ట్ర ప్రభుత్వంలో ఉ న్న ఉన్నతాధికారుల దృష్టికి ప్రభు త్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో ఉ న్న కేంద్ర మంత్రి నితిన్ గడ్గరితో కూ డా మాట్లాడతానని హామీ ఇచ్చా రు. మీకు న్యాయం జరిగేంతవరకు శాసన సభ్యునిగా మీతో పాటు కలి సి పోరాడుతానని సంచలన ప్రక టన చేశారు.
అంతకుముందు ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ మధ్యలో ఉండాల్సిన దూరo ఒక్కో ప్రాంతంలో ఒక్కో ర కంగా సెట్ చేశారని, చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గానికి వ చ్చేసరికి ఆ రెండు రహదారుల మ ధ్య ఉన్న దూరాన్ని తగ్గించి అలై న్మెంట్ ఫైనల్ చేస్తున్నారని, వేరే చో ట ఎంత దూరమైతే ఉన్నదో ఇక్కడ కూడా అంత దూరంలోనే త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చేలా చర్యలు తీ సుకోవాలని రాజ్ గోపాల్ రెడ్డికి వి న్నవించారు. చౌటుప్పల్ పట్టణంలో ఉన్న ప్రముఖ పరిశ్రమలకు లాభం చేకూర్చడానికే అలైన్మెంట్ మార్చార ని విమర్శించారు.
పరిశ్రమల యాజమాన్యాలకు మే లు చేయడానికి వందల మంది రై తుల వ్యవసాయ భూములు కో ల్పోతున్నామని ఆవేదన చెందా రు. ఎమ్మెల్యే గారిని కలిసిన వారి లో నారాయణపూర్ మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు, గట్టుప్పల్ మండలానికి చెందిన ప లు గ్రామాల రైతులు ఉన్నారు.