MLA Rajgopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య,జన్మతః నే ను కాంగ్రెస్ పార్టీ లోనే పుట్టిన, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా
MLA Rajgopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చే శారు. జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ లోనే పుట్టిన, నా రక్తంలో కాంగ్రెస్ ఉంది, చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో నే ఉంటానని స్పష్టం చేశారు. ఆస్తు ల అమ్ముకొని పార్టీని బ్రతికించడా నికి పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు క ష్టకాలంలో కమిట్మెంట్ తో కాంగ్రెస్ పార్టీ జెండాను బతికించే విధంగా పనిచేసినవాన్ని, రాజధానికి కూత వేటుదూరంలో ఉన్న మునుగోడు వెనకబడే ఉంది, దశాబ్దాలుగా ము నుగోడులో అభివృద్ధి జరగకుండా అన్యాయం జరిగిందని, ఇప్పటికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని అవేదన వ్యక్తం చేశారు. న ల్లగొండ డిసిసి అధ్యక్షుని ఎంపిక అ భిప్రాయం సేకరణ సమావేశంలో ఆ యన ప్రసంగించారు.
ఎఐసిసి పెద్ద లు ఎవరిని డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేసిన మాకు అభ్యంతరం లేదని అన్నారు. న ల్గొండ జిల్లా కాంగ్రెస్ వల్లనే రాష్ట్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిందన్నారు.
రాజగోపాల్ రెడ్డి గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పేరున్న నేత, ఆయన స్థాయి కి మంత్రి పదవనేది తక్కువే, అంతకు మించిన కేపాసిటీ ఉన్న నేత మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అధిష్టానానికి మీ ఆవేదనను మీ కోరికను తెలియజేస్తాను నేను తిరిగిన ఏ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రేమ ఎక్కడ కూడా చూడలేదు
ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బి శ్వరంజన్ మహంతి మాట్లాడుతూ తెలంగాణలో క్రేజీ ఫాలోయింగ్ ఉ న్న లీడర్ రాజగోపాల్ రెడ్డి అని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, కోరికను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపి క కొరకు నియోజకవర్గంలోని ము ఖ్య నాయకుల అభిప్రాయం తీసు కోవడానికి మునుగోడుకు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి తో పిసిసి పరిశీలకులు వచ్చారన్నారు. మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకున్నారన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ముఖ్య కార్యకర్త ఏఐసీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓ సిలలో ఎవరిని డిసిసి అధ్యక్షులు గా ఎంపిక చేసిన మా మద్దతు ఉం టుందని, దాంతోపాటు అధిష్టానం మునుగోడు నియోజకవర్గానికి ఇ చ్చిన కమిట్మెంట్ కూడా నిలబెట్టు కోవాలని కుండ బద్దలు కొట్టినట్టు ఏకవాఖ్య తీర్మానాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా కొందరు నాయకు లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో వున్నపుడు రాజగోపాల్ రెడ్డి పార్టీని బ్రతికించారని గుర్తు చే శారు. 2009 నుండి ఈరోజు వరకు ప్రతిపక్షాలకు ఎదురొడ్డి కాంగ్రెస్ పా ర్టీ జెండాను నిలబెడుతున్నాడని, మొన్నటికి మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని ఎంపీ గా గెలిపించి సత్తాచాటాడని అ న్నారు. ఎంపీగా గెలిపించి వస్తే మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చి హామీను నిలబెట్టుకోలే దన్న విషయాన్ని ఏఐసిసి మాజీ జనరల్ సెక్రెటరీకి తెలిపారు.
మంత్రి పదవి ఇచ్చి మాట తప్పిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసు కెళ్లాలని పలువురు ముఖ్య నాయ కులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాజగోపాల్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో పేరున్న నాయకుడని, ఆయన స్థాయికి మంత్రి పదవి చిన్నదని, ఇంకా పెద్ద పదవులు అధిష్టించే సత్తా ఉన్న నాయకుడని విశ్వ రం జన్ మహంతి కొనియాడారు. ఖచ్చి తంగా మీ ఆవేదనను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని, మీ ఓ పికకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో క్రేజీ ఫాలోవ ర్స్ ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డిని, ఆయనకు అధిష్టానం ఇచ్చి న హామీని నిలబెట్టాలని ఏఐసిసి ప్రతినిధి ద్వారా రిపోర్ట్ పంపిస్తామ ని అన్నారు.ఈ సమావేశంలో ఎఐ సిసి మాజీ జనరల్ సెక్రెటరీ బిశ్వ రంజన్ మహంతితోపాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పిసిసి పరిశీలకు లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ని యోజకవర్గ వ్యాప్త ముఖ్య నాయ కులు ముఖ్య కార్యకర్తలు పాల్గొ న్నారు.