Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Muralidharan: జీవితాలను ఫారెన్ చదువులు

–ఐదేళ్లలో 633 మంది భారత విద్యార్థుల మృతి

Muralidharan:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులు దురదృష్టకర పరిస్థి తుల్లో మృత్యువాత పడుతు న్నారు. గత ఐదేళ్లలో 633 మంది విద్యార్థులు ఇలా 41 దేశాల్లో మర ణించారు. ఈమేరకు విదేశీ వ్య వహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ (Muralidharan) కేరళ ఎంపీ కొడికునిల్‌ సురేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు సమాధా నంగా లోక్‌సభలో సమాచారం ఇచ్చా రు. విదేశీ వ్యవహారాల శాఖ (Department of Foreign Affairs) ఇచ్చిన సమాచారం ప్రకారం అత్య ధికంగా కెనడాలో 172 మంది చని పోయారు. తరువాతి స్థానంలో 108 మందితో యూఎస్‌(అమెరికా) ఉంది. యూకేలో 58, ఆస్ట్రేలియా లో 57, రష్యాలో 37, జర్మనీలో 24 మంది మృత్యువాత పడ్డారు. పాకి స్థాన్‌లో (Paki Stan)కూడా ఒక భారత విద్యార్థి మరణించారు. ఇలా విద్యార్థుల మరణాలకు కారణాలు పరిశీలిస్తే సహజ మరణాలు, ప్రమాదాలు, దాడులు కారణాలుగా ఉన్నాయి. 19 మంది విద్యార్థులు హింసాత్మక దాడుల్లో మరణించగా వారిలో అత్యధికంగా కెనడాలో 9 మంది, యూఎస్‌లో ఆరుగురు, ఆస్ట్రే లియా, యూకే, చైనా, కిర్గిజిస్థా న్‌లలో ఒక్కొక్కరు చొప్పున మర ణించారు. 2024 లెక్కల ప్రకా రం13.3 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో విద్యన భ్యసిస్తున్నారు.