–నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు 16 వేల కోట్లు అవసరం
–జల్ జీవన్ మిషన్ నిధులు మం జూరు చేయండి
–ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి..
–గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం అనుమతివ్వండి
–కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తులు,రాహుల్, ఖర్గేతో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ
–ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి
Musi Riverfront Development:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప డుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు (Musi Riverfront Development)జాతీయ నదీ పరిర క్షణ ప్రణాళిక కింద రూ.10వేల కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy)కోరారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల మేర ప్రవాహిస్తున్న మూ సీలో మురుగు నీరు చేరుతోందని, దీనిని శుద్ధి చేయాలని తమ ప్రభు త్వం సంకల్పించిందని తెలిపారు. శ్రమ శక్తి భవన్‌లో సోమవారం కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మూసీలో చేరే ము రుగును శుద్ధి చేయడం, వరద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరిం చాలని కోరారు. ఇందులో భాగంగా మూసీలో మురుగు నీటి శుద్ధి పను లకు రూ.4వేల కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి జలాలతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6వేల కోట్లు కేటాయించాలని అభ్యర్థించారు. తెలంగాణలో 7.85లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వీటితోపాటు పీఎంఏవై కింద నిర్మించనున్న ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్లు అవసరమవుతాయని, జల్‌జీవన్ మిషన్ (Jaljeevan Mission)కింద నిధులు కేటాయించి విజ్ఞప్తి చేశారు. అలాగే, ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ కోరారు. 2014–15 ఖరీఫ్‌లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని, ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించామని గుర్తుచేశారు. పీఎం గరీబ్ కల్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987టన్నుల బియ్యానికి సంబంధించిన రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు.
2021 మే నుంచి 2022 మార్చి వరకు జాతీయ ఆహార భద్రతా చట్టం (National Food Security Act)పరిధిలో కాకుండా పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పార్లమెంట్ హౌస్‌లోని కార్యాలయంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నామని గుర్తు చేస్తూ.. ఇందుకు సంబంధించిన సబ్సిడీని సంబంధిత కంపెనీలకు ముందుగానే చెల్లించే వెసులుబాటు కల్పించాలనికోరారు. తద్వారా లబ్ధిదారులకు నేరుగా రూ.500కే సిలిండర్ అందించే వీలు ఉంటుదన్నారు. అలా వీలుకానీ పక్షంలో తాము చెల్లించే సబ్సిడీని 48 గంటల్లోపు లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల్లో సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్, రఘురామిరెడ్డి, (Deputy CM Bhatti Vikramarka, State Irrigation Minister Uttam Kumar Reddy, MPs Anil Kumar, Raghurami Reddy,)అధికారులు ఉన్నారు.