Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mutual attacks: విశాఖలో విద్యార్ధుల పరస్పర దాడులు

Mutual attacks: ప్రజా దీవెన, వైజాగ్: విశాఖపట్నంలో విద్యార్థులు తమను తాము మర్చిపోయి రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఓ కాలేజీ స్టూడెంట్స్ (College students)బాజీ జంక్షన్ సమీపంలో పరస్పరం దాడి చేసుకున్నారు.ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేశారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడం తో చాలా మంది గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్ (Traffic jam) కారణంగా చాలా మంది ప్రయాణికులు గంటల తరబ డి ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయారు.’

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు (The students) ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు విసురు కున్నారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదు పులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందా లను రంగంలోకి దించారు. ఘర్షణ వెనుక కారణాలు ఇంకా తెలియలే దు. పోలీసులు ఈ విషయంపై దర్యా ప్తు చేస్తున్నారు. ప్రత్యర్థి వర్గం (The opposing faction) తమపైనే ముందు దాడి చేశారం టూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు (Police complaint)చేశారు.నడి రోడ్డు (Nadi Road)పై ఇటువంటి ఘటన జరగటం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణకు పాల్పడిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాన్ని కోరారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ఘర్షణకు పాల్పడిన విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. విచారణలో తేలిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.