Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 12:29 pm Posted by : praja deveena

Nalgonda additional Collector Srinivas : రబీ సీజన్ యూరియా పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

–జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్

Nalgonda additional Collector Srinivas : ప్రజా దీవె న, నల్లగొండ: రబీసీజన్ కి సంబంధించి యూరియా పంపిణీ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్ట ర్ జే. శ్రీనివాస్ అన్నారు. ఈ రబీ సీ జన్లో రైతులకు యూరియా సరఫరా యూరియా పై ఏర్పాటు చేసిన “ఫ ర్టిలైజర్ బుకింగ్ యా ప్” పై మంగళ వారం ఉదయాదిత్య భవన్ లో ఏర్పాటుచేసిన శిక్ష ణ కార్యక్రమం మ రియు సమావేశానికి హాజరయ్యా రు. జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎలాంటి ఆం దోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

యూరియా కోసం రైతులు గతంలో లాగా క్యూ లైన్ లలో నిలబడా ల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకు వచ్చిన “ఫర్టిలైజర్ బుకిం గ్ యాప్ ” రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంద ని తెలిపారు.ఈ యాప్ ద్వారా కూ ర్చున్న చోటు నుండే ఏ షాపులో ఎంత యూరి యా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని, అంతేకాక ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో వెం టనే తెలిసిపోతుందని అన్నారు. ప్ర భుత్వం ఏర్పాటు చేసిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల యూరియా క్ర మబద్దీకరణ సైతం చేసుకోవచ్చని, అలాగే ఏ పంటకు ఎంత యూరి యా వేయాలో కూడా యాప్ లో అందుబాటులో ఉందని, నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా నిర్వ హిస్తున్నప్ప టికీ ఈ యాప్ పై ఇంకా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు.

రైతులు అనవసరంగా ఎక్కువ మొ త్తంలో యూరియా వాడితే భూమి సారవంతం కోల్పోయి దిగుబడి త గ్గే అవకాశాలు ఉన్నాయ ని, ఈ విష యం రైతులకు అవగాహన కల్పిం చాలని అన్నారు. జిల్లాలో యూరి యా పంపిణీని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ స్థాయి లో పర్యవేక్షించ డం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ అమ్మకం కేంద్రాల వద్ద అదనపు కౌం టర్లు ఏర్పాటు చేయాలని, షామి యా నా, తాగునీరు ఏర్పాటు చే యాలని, ప్రతి కేంద్రం లో కనీసం మూ డు కౌంటర్లు ఏర్పాటు చేయాల ని చెప్పారు. ఉదయం 6 గంటల నుండే యూరియా అమ్మకాలు ప్రా రంభించాలని, యూరియా సర ఫరా సక్రమంగా నిర్వహించేందుకు మం డల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక అ ధికారులను నియమించడం జరిగిం దని తెలిపారు.

డీలర్ రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకొన్న ఐడి నెంబర్ ఆధారం. గా యూరియాను పంపిణీ చేయాలని, ఒకవేళ ఎవరైనా రైతు యాప్లో బుక్ చేసుకోకుండా నేరుగా ఫర్టిలైజర్ కేంద్రానికి వచ్చినట్ల యితే రైతులకు స హకరించి యాప్ లో బుక్ చేసుకు నే విధంగా చూడాలన్నారు. యూరి యాను బ్లాక్ మార్కెటింగ్ చేయవద్ద ని, అవసరం ఉన్నంత మేరకే యూ రియాను ఇవ్వాలని, ఇతర విని యోగాలకు యూరియా వాడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవ డం జరుగుతుందని, యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో ఉండ కుండా చూసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ధాన్యం సేకరణ పై సమీక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా సహకార అధికారి పత్యా నా యక్, దేవరకొండ ఆర్ డి ఓ రమ ణా రెడ్డి, పౌరసరఫరాల జిల్లా అధి కారి వెంకటేష్, మార్క్ఫెడ్ డిఎం జ్యోతి, వ్యవసాయ సహాయ సంచా లకులు, వ్యవసాయ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల సీఈవోలు, తహసిల్దార్లు, తదితరులు ఈ సమా వేశానికి హాజ రయ్యారు.