Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 January 2026, 7:20 am Posted by : praja deveena

BJP President Nagam Varshit Reddy : నల్లగొండ బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిశానిర్దేశం, కార్పోరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి 

BJP President Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: త్వర లో రాబోయే నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణు లు సర్వం సిద్ధంగా ఉండాలని నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దిశానిర్దేశం చేశా రు. బుధవారం నల్లగొండ కార్పొరే షన్ సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్ష లు తెలిపారు. నల్లగొండ పట్టణం చాలా సంవత్సరాల తర్వాత కార్పొ రేషన్ గా మారడంతో కేంద్రం నుండి నిధులు నేరుగా వస్తానని తెలిపా రు. నల్గొండ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు కేంద్ర నిధులు ఉపయోగపడతా యని తెలిపారు.

నల్లగొండ పట్టణానికి వచ్చిన నిధు లు గతంలో కేంద్రం నుండి రావడం జరిగిందని అమృత్ స్కీం నిధులు నల్గొండ పట్టణానికి అందడం వల్ల అండర్ గ్రౌండ్ వ్యవస్థ మెరుగుపడిం దని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో నే వీధిలైట్లు తదితర అభివృద్ధి కా ర్యక్రమాలను చేపట్టడం జరుగు తుందని వివరించారు. గతంలో మున్సిపాలిటీ పాలక పక్షాలు నల్ల గొండ పట్టణ అభివృద్ధిని విస్మరించి కమీషన్ ల కోసం పాకులాడుతూ పట్టణ అభివృద్ధిని అదమర్చిపో యారని ఆరోపించారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికీ సరైన స్మశాన వాటికలు లేక కేంద్రం ఇచ్చే నిధులను దుర్వినియోగం చే సి నల్గొండ పట్టణ ప్రజల ఇబ్బందు లకు గురిచేసిన ఈ పాలక పక్షాలకు రాబోయే ఎన్నికల్లో తగు గుణపా ఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బం డారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్ గౌడ్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖ ర్, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పల్లె బో యిన శ్యాంసుందర్, నూకల వెంక ట్ నారాయణ రెడ్డి, పోతెపాక లింగ స్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకన బోయిన రమణ ముదిరాజ్, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, కంకణా ల నాగిరెడ్డి, రావిరాల వెంకన్న, గు ర్రం వెంకన్న, దాసరి సాయి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, చింత ముత్యాలరావు, నీరజ, ఒంగోలు రాఖీ, మంగళపల్లి కిషన్, బిపంగి జగ్జీవన్ తదితరులు పాల్గొన్నారు.