
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎస్సీ ఎస్టీ లపై దాడుల నిరోధం, హక్కుల రక్ష ణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. మం గళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మం దిరంలో జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ వి జిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమా వేశంలో 1995 పౌర హక్కుల రక్ష ణ చట్టం మరియు ఎ స్సీ ,ఎస్టీలపై దాడుల నిరోధక చ ట్టం- 1989 అ మలుతీరుపై సమీ క్షించారు.ప్రజా ప్రతినిధులు, అధి కారు లు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ సభ్యుల సహకారంతో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరగకుండా ని రోధిం చడం, దాడులకు గురైన వా రికి న్యాయం చేసేందుకు తక్షణ చ ర్యలు తీసుకుంటామని జిల్లా కలె క్టర్ చెప్పారు. ఎస్సీ, ఎ స్టీలపై దా డులకు గురైన సందర్భాలలో తక్ష ణమే కేసులు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు, బాధితులకు నష్టప రిహారం అందజేత, కేసులను సత్వరం పరిష్కరించేందుకు పోలీ స్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ప్రక్రియను వేగవం తం చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు.
ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉండే చోట వారి సమస్యల పరి ష్కారానికి కృషి చే స్తామని, దళిత వాడల్లో పారిశు ద్ధ్యం, టాయిలెట్ల నిర్మాణం, డ్రైనే జీ తదితర సౌకర్యాల కల్పనకు కృ షి చేస్తామని తెలిపారు. అలాగే ఎ స్సీ, ఎస్టీ తండాలలో నాటు సారా బారినపడకుండా పోలీస్, ఎక్సైజ్ శాఖ తరపు న తగుచర్యలు తీసు కుంటామని, ప్రభుత్వం ద్వారా వా రికి జీవనోపాధి కార్యక్రమాలు అ మలు చేస్తామని, అటవీ భూ ము లకు సంబంధించి వారికి అందాల్సి న హక్కులను క ల్పించే విధంగా చూ స్తామని, ఎస్సీ ఎస్టీలకు సం బంధించి భూ ఆక్రమణ కేసుల వి షయాల్లో వెంటనే చర్యలు తీసుకు నేలా అధికారులు చూడాలని ఆ యన ఆదేశించారు.
ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకొన్న చ ర్యలు, ఈ మూడు నెలల కాలంలో నమోదైన కేసులు, వాటి పరిష్కా రం, ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్ న మో దు నష్ట పరిహారం అందజేతపై సమావేశంలో చర్చించారు. కాగా జిల్లాలో ఎస్సీ ,ఎస్టీలపై దాడులకు సంబంధించి 49 కేసులు విచార ణ లో ఉండగా పెండింగ్ ట్రయల్ కే సులు 798 ఉన్నట్లు సాంఘిక సం క్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ సమావేశం దృష్టికి తెచ్చారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మా ట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీలపై దాడుల కేసులలో బాధితులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చే సిన పోలీస్ త రఫున చర్యలు తీసుకుంటామని ఎస్సీ ,ఎస్టీ ల పై దాడులకు సంబం ధించి జాప్యం లేకుండా తక్షణమే బాధ్యులను గుర్తించి అరెస్టు చేయడం, కేసు నమోదయ్యేలా చ ర్యలు తీసుకుంటున్నామని, అలా గే ఎస్సీ, ఎస్టీలు కేసుల నమోదుకు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు పోలీస్ స్టేష న్లో సంబంధిత ఎస్సై లే కున్నా హెడ్ కానిస్టేబుల్ ద్వారా కూ డా కేసు నమోదు చేసుకునే అ వకాశం ఉందని తెలిపారు. కేసుల నమోదుకు ఎలాంటి సంఘం ద్వా రా బాధితులు రావాల్సిన అవస రం లేదని, పోలీసులే తగు చర్య తీసు కుంటారని ఎస్పి స్పష్టం చేశారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బ త్తుల లక్ష్మారెడ్డి మాట్లాడు తూ రా ష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షే మానికి అనేక కా ర్యక్రమాలు అమ లు చేస్తున్నదని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు దళితవాడల్లో వారి కి అందే విధంగా చూడాల్సిన బా ధ్యత అధికారులు, ప్రజాప్రతిని ధు లు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ క మిటీ సభ్యులపై ఉందని, అందరు కలిసి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జ రిగేలా చూడాల్సిన బాధ్యత అంద రిపై ఉందన్నారు. ముఖ్యంగా ఎ స్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నచోట సమస్యలు ఎక్కువగా ఉంటాయ ని, అలాంటి దళితవాడలు, బస్తీల పై దృష్టి సారించి వారికి ఇబ్బందు లు లేకుండా న్యాయం చేసే విధం గా చర్యలు తీసుకోవాలని, ప్రత్యే కించి దళితవాడల్లో సిసి రోడ్లు, డ్రై న్లు ,టాయిలెట్లు ఉండేలా చూడా లని అన్నారు.
తన నియోజకవ ర్గంలోని 119 గ్రామపంచాయతీ ల లో 7,8 తాండాలలో నాటుసారా ఎక్కువగా ఉందని, దీనివల్ల అక్క డ ఉన్న ఎస్సీ, ఎస్టీలు సారాకు బా నిసై ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మ రణిస్తున్నారని, దీనిపై చర్య తీసు కోవాలని, ఆ గ్రామాలలో పునరా వాసలో భాగంగా ప్రభుత్వం పరం గా వారికి జీవనోపాధి కార్యక్రమాల ను అమలు చేయాలని కోరారు. అ లాగే అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చేయాల ని,ఎస్సీ, ఎస్టీల కు అమలు చేస్తు న్న రుణాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశానికి హాజరైన సభ్యురా లు సంకు ధనలక్ష్మి మాట్లా డుతూ గ్రామ కంఠం భూములను కొందరు పెద్దలు ఆక్రమి స్తున్నారని దీనివల్ల కొన్నిచోట్ల ఎస్సీ ,ఎస్టీలకు అన్యా యం జరుగుతున్నదని, పోలీస్ స్టే షన్లో బాధితులు ఫిర్యాదు చేసేందు కు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చే యాలని, అలాగే నల్గొండ పరిధి లోకి వచ్చే ఒక కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నదని సమావేశం దృ ష్టికి తీసుకువచ్చారు.
మరో సభ్యు రాలు అనిత కుమారి మాట్లాడుతూ దేవరకొం డ డివిజన్ లో ఎ స్సీ ,ఎస్టీలకు సంబంధించిన కేసు లు కోర్టు లో చాలా రోజులుగా పెం డింగ్ లో ఉన్నాయని, వాటి పరి ష్కారానికి ప్రత్యేక చొరవ చూపా లని ,అలాగే గుర్రంపోడు మండలం పిట్టలగూడెం సంబంధించి మీసాల పార్వతమ్మ భూ అక్రమణ కేసును పరిష్కరించాలని ,చెన్నారం ఎస్టీ గురుకుల పాఠశాల ప్రహరీ లేక వి ద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని సమావేశం దృష్టికి తీ సుకువచ్చారు.
మరో సభ్యులు బూరుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లపై దాడుల సందర్భంగా బాధితులకు పోలీసులు భ రోసా కల్పించేలా చూడాలని, దాడికి పాల్పడిన వా రిని వెంటనే అరెస్టు చేసినట్లయితే పోలీసులపై నమ్మకం కలు గుతుం దని అన్నారు. మరో సభ్యుడు బె జ్జం సైదులు మా ట్లాడుతూ ఎస్సీ , ఎస్టీలకు ప్రభుత్వం నుండి అందే రుణాలు సరిగా రావడం లేదని, అ లాగే దామరచర్ల మండలం దిలా వర్పూర్ లో 176 సర్వే నెంబర్లు ఎస్సీలకు ఇప్పటివరకు పాసు పు స్తకాలు రాలేదని ,ఎస్సీ కాలనీల లో టాయిలెట్స్, రోడ్ల నిర్మాణం చే పట్టాలని, మిర్యాలగూడ ప్రాంతం లో కృష్ణాజలాలూ కాలుష్యానికి గురి కావడం వలన ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నారని స మావేశం దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ సభ్యులు సమావే శంలో లేవ నెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం తరఫున అవ సరమైన చర్యలు తీ సుకుంటామని వెల్లడించారు.ఈ సంద ర్భంగా దేవరకొండ, నల్గొండ డిఎస్పీలు, సంబంధిత ఆర్డీవో లు ఈ త్రైమాసికంలో ఎస్సీ ఎస్సీ లపై జరిగిన దాడులు, ఇన్వెస్టిగేషన్ , ఎ ఫ్ ఐ ఆర్ నమోదు, నష్ట పరి హా రం చెల్లిం పులపై నివేదిక సమర్పిం చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,డి ఆర్ ఓ దశ రథ, ఆ ర్డివో లు రమణారెడ్డి, శ్రీదే వి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశిక ళ ,సభ్యులు ,వివిధ శాఖల అధికా రులు హాజరయ్యారు.






