
Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా పా ల న ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 4 నుండి నిర్వహి స్తున్న రైతు వారోత్సవంలో భాగం గా రైతులకు వివిధ అంశాలపై అవ గాహన కల్పించే క్రమంలో మూడ వ రోజైన బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించిన అవగాహ న సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించా లని, ప్రత్యేకించి ఆయా భూముల కు అనుకూలంగా ఉండే పంటలు పండిస్తే అధిక దిగుబడులతో పా టు, అధిక లాభాలు సాధించవచ్చ న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయి ల్ హెల్త్ కార్డులను మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆ యా గ్రామాలలోని భూములకు అ నుగుణంగా పంటలు వేసేందుకు జి ల్లా యంత్రాంగం తరుపున అవసర మైతే ఒక డ్రైవ్ లా భూముల సార వంతం పరిశీలించడం జరుగుతుం దని తెలిపారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పు డే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మార్కెట్ సౌ కర్యం కల్పించాల్సిన బాధ్యత ప్ర భుత్వం పై ఉంటుందని అన్నారు. రైతులు ఒకే పంటను పండించకుం డా అన్ని రకాల పంటలు పండిం చాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధ తులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థి తులకు అనుకూలంగా పంటలు పండించాలని చెప్పారు.
ముఖ్యంగా పంటల సాగుతో పా టు, పండించిన పంటల ద్వారా అ ధిక లాభాలు పొందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌక ర్యాలు వినియోగించుకొని పంట లు నిల్వ చేసుకోవడం ద్వారా ఎ క్కువ ఆదాయం పొందవచ్చని అ న్నారు. వ్యవసాయంలో మార్పు లు చేసుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉందని ఈ సందర్భంగా ఆ యన చెప్పారు. వరిలో ఎల్లప్పు డూ దొడ్డు బియ్యం కాకుండా, డి మాండ్ ఉన్న సన్న బియ్యం ఇతర రకాల ధాన్యాన్ని పండించాలని రై తులకు సూచించారు. రైతు సoక్షే మంలో భాగంగా తిప్పర్తి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఉ న్న భూమిని రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు సుముఖవ్యక్తం చేసిన నేపథ్యంలో నాబార్డ్ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుం టామని కలెక్టర్ చెప్పారు. జిల్లా కేం ద్ర సహకార బ్యాంకు ద్వారా ఇచ్చే రుణాలకు ఎలాంటి పాస్ పుస్తకా లు లేకుండా ఆన్లైన్లో భూభారతి వి వరాల ఆధారంగా లోన్లు మం జూ రు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిఈఓను ఆదేశించారు.
నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగో లు సమస్య పరిష్కారానికి కృషి చే స్తున్నామని, ధాన్యం సేకరణను త్వరలోనే పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. రైస్ మిల్లర్లు, లారీ లు,వర్షం, తదితర కారణాలవల్ల కొనుగోలులో కొద్దిపాటి జాప్యం ఏ ర్పడిందని, మిల్లర్లు,హమాలీలు త దితర సమస్యలను రాష్ట్ర పౌర స రఫరాల శాఖ మంత్రి ,ఆర్ అండ్ బిశాఖ ఆమాత్యులతో మాట్లాడి చర్చించి సమస్యలన్నీ అధిగమిం చడం జరిగిందని తెలిపారు. ప్రస్తు తంధాన్యం తరలించేందుకు 900 లారీలు ఏర్పాటు చేయడం జరిగిం దని, కేవలం 20 రోజులలో 3 లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయడం జరిగింద ని, ప్రతిరోజు ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులు, సిబ్బంది తో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫ రెన్స్, సమీక్షలు నిర్వహిస్తున్నా మ ని, ధాన్యం సేకరణ వేగవంతం చే సేందుకు చర్యలు తీసుకుంటు న్నామని, ప్రస్తుతం మిల్లులలో అ న్లోడింగ్ సమస్య లేదని తెలిపారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకా లు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, ధాన్యం కొనుగో లు పై రాష్ట్ర ఆర్ అండ్ బి మంత్రి తో పాటు ,జిల్లా కలెక్టర్ ప్రతిరోజు సమీక్షిస్తున్నారని, వారం, పది రో జుల్లో దాన్యం తరలించేందుకు చ ర్యలు తీసుకోవడం జరిగిందని, రై తులు ఎల్లప్పు డూ వరినే సాగు చే యకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. ఈ సం దర్భంగా వివిధ శాఖల అధికారు లు వారి శాఖ ద్వారా అందించే ప థకాలపై రైతులకు అవగాహన క ల్పించారు. మార్కెట్ కమిటీ చై ర్మ న్ జూకూరి రమేష్, పిఎసిఎస్ అ ధ్యక్షులు నాగరత్నరాజు, సహదే వ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయా దే వి, ఎల్డిఎం శ్రామిక్, జిల్లావ్యవ సా య అధికారి శ్రవణ్ పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారి పత్యా నాయక్ కార్యక్రమానికి అధ్యక్షత వ హించారు.





