Nalgonda Collector Tripathi : దుగ్యాలలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Nalgonda Collector Tripathi : ప్రజా దీవెన, పీఏ పల్లి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు, పరి సరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పా రు. గురువారం ఆమె పీఏ పల్లి మం డలం దుగ్యాలలోని తెలంగాణ మో డల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్, పాఠ శా ల పరిసరాలను పరిశీలించారు. వం ట గదిలో వంట వండేందుకు ఇంకా కట్టెలపొయ్యిని ఉపయోగిస్తుండ డాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎల్పీజీ కనెక్షన్ కు దరఖాస్తు చేయాలని సూచించారు.
వంట పదార్థాలపై ఎలాంటి పురు గులు, దోమలు పడకుండా జాగ్రత్త లు తీసుకోవాలని,మూతలు ఉంచా లని, భోజనం పూర్తి నాణ్యతగా వం డి వడ్డించాలని, ఆహారం కలుషితం కాకుం డా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యలోపం, ఆహారం కలుషి తం వంటి కారణాలవల్ల విద్యార్థు లు అనారోగ్యానికి గురి కాకూడదని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత ప రిశుభ్రతను పాటించాలని, అంతేకా క పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల ని పాఠ శాల ప్రిన్సిపాల్ ను, ఉపా ధ్యాయులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు వివిధ అంశాలపై పాఠాలు చెప్పా రు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డివో రమణా రెడ్డి, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, మండల స్థాయి అధి కారులు తదితరులు ఉన్నారు.